France: ఫ్రాన్స్‌లో భారీగా చెలరేగుతున్న ఆందోళనలు.. కనపడిన వాటిని తగులబెడుతున్న నిరసనకారులు.. ఎందుకంటే?

టౌన్ హాళ్లు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనకారులు నిప్పు అంటించి ఆందోళనలు చేస్తుండడం కలకలం రేపుతోంది.

France – Protest: ఫ్రాన్స్‌లో భారీగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. దీంతో పోలీసులు దాదాపు 150 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ప్యారీస్ (Paris) సమీపంలోని నాంటెర్రే (Nanterre) లో గత మంగళవారం ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆ సమయంలో 17 ఏళ్ల కుర్రాడు నాహెల్ ను కాల్చి చంపడమే ఫ్రాన్స్ లో జరుగుతున్న ఆందోళనలకు కారణం.

టౌన్ హాళ్లు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనకారులు నిప్పు అంటించి ఆందోళనలు చేస్తుండడం కలకలం రేపుతోంది. ఆందోళనాకరుల తీరు సరికాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) అన్నారు. మంగళవారం కుర్రాడిని కాల్చి చంపిన పోలీసు అధికారిపై విచారణ జరుగుతోంది.

నాహెల్ ను ఆ పోలీసు అధికారి పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చాడు. ట్రాఫిక్ లో పోలీసుల నుంచి తప్పించుకుని నాహెల్ పారిపోతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలపై మ్యాక్రాన్ నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించి చర్చించారు.

గత రాత్రి పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుందని అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మానిన్ అన్నారు. నాంటెర్రేలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కార్లను, దుకాణాలను ఆందోళనకారులు తగులబెడుతున్నారు. కనపడిన వాటిని తగులబెడుతూ కలకలం రేపుతున్నారు.

Reuters Report: ఒక్క ట్రంప్ తప్ప అమెరికా అధ్యక్షులంతా బానిస యజమానులే, ఒబామా కూడా

ట్రెండింగ్ వార్తలు