India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా

ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిఘా విభాగం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా-చైనా, ఇండియా-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.

India-Pak: పాకిస్తాన్ కనుక రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిఘా విభాగం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాల్ని ప్రస్తావించారు.

MLC Kavitha ED Trial Postponed : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఊరట

ఈ నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా-చైనా, ఇండియా-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉంది. గతంలో కంటే పాక్ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం భిన్నంగా, ఘాటుగా స్పందిస్తోంది. ఇండియా-చైనాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు వివాదం మూలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ అంశంలో రెండు దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ, సరిహద్దులో సైనిక బలగాల మోహరింపు, ఆయుధాల పెంపు వంటి అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి.

India In UN: ముందు మీ దేశాన్ని బాగు చేసుకోండి.. పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ఘర్షణ చివరకు అమెరికాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుందని ఆ నివేదికలో వెల్లడించారు. రెండు దేశాల మధ్య సమస్య తలెత్తితే అమెరికా జోక్యం తప్పనిసరి అంటూ నివేదికలో పేర్కొంది. ఇండియా-పాక్ మాత్రం కాల్పుల విరమణ పాటిస్తూ సంయమనంతోనే ఉంటున్నాయని నివేదికలో తెలిపారు. అయితే, భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలపై మోదీ ప్రభుత్వం గట్టిగా స్పందిస్తుందని అమెరికా నిఘా విభాగం అభిప్రాయపడింది.

ట్రెండింగ్ వార్తలు