Gulf Countries Rs.2,000 Note : రూ.2వేల నోట్లు వద్దంటున్న గల్ఫ్ అధికారులు .. ఆందోళనలో భారతీయులు

రూ.2000 నోట్ల రద్దుతో భారతదేశంలోనే కాదు విదేశాల్లోకూడా భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు.గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారు.. రూ.2వేల నోట్లు మార్చుకోవటానికి నానా తిప్పలు పడుతున్నారు.

Gulf Countries Indian Rs.2,000 Notes : రూ.2000 నోట్ల రద్దుతో భారతదేశంలోనే కాదు విదేశాల్లోకూడా భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. కరెన్సీ మార్పిడి కేంద్రాలకు వెళితే భారతదేశ కరెన్సీ రూ.2000 నోట్లు (2000 Notes)తీసుకోం అని గల్ఫ్ అధికారులు చెబతున్నారంటూ భారతీయులు వాపోతున్నారు. దీంతో భారతీయులు రూ.2వేల నోట్లు మార్చుకోవటం అనేది పెద్ద తలనొప్పిగా మారిపోయిందని వాపోతున్నారు. భారత్ కు సంబంధించిన రూ.2వేల నోట్లు తీసుకోవద్దని తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) అధికారులు చెబుతున్నారు. దీంతో రెండు వేల నోట్ల రూపాయల్ని తీసుకోకపోవటంతో తాను గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు భారతీయులు.

 

రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశించింది. అలాగే ప్రజలు తమవద్దనున్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది. బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని, లేదా వారి ఎకౌంట్స్ లో డిపాజిట్‌ చేసుకోవాలని సూచించింది. దీంతో జనాలు రెండు వేల నోట్లు వదిలించుకునే పనిలో పడ్డారు. తమకు ఎవరైనా రెండు వేల నోటు ఇస్తే ఎవ్వరు తీసుకోవటంలేదు. ఆఖరికి చిరువ్యాపారులు గానీ..సూపర్ మార్కెట్స్ లో కూడా రెండు వేల నోట్లు తీసుకోవటంలేదు. ఆఖరికి కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే రెండు వేల నోటు నాట్ ఎలౌవ్డ్ అని బోర్డులు కూడా పెట్టేశారు.

Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఈక్రమంలో ఇప్పటికే గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారు.. రూ.2వేల నోట్లు మార్చుకోవటానికి నానా తిప్పలు పడుతున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా అక్కడి కరెన్సీ మార్పిడి కేంద్రాలు కూడా రూ.2 వేల నోట్లను తీసుకోవడం నిలిపివేశాయి. దీంతో తమ వద్దనున్న నోట్లను మార్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. చేతిలో డబ్బులున్నా వాటిని వినియోగించుకునే అవకాశం లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని పలువురు చెబుతు వాపోతున్నారు.

ఫిరోజ్‌ షేక్‌ అనే ఓ మహిళ.. భర్తను కలిసేందుకు తన ఇద్దరు పిల్లలతో దుబాయ్‌ వెళ్లారు. అక్కడ తన వద్ద ఉన్న ఎనిమిది రూ.2 వేల నోట్లు మార్చుకోబోతే వారు తీసుకోలేదు. దీంతో ఆమె షాక్ అయ్యింది. సెప్టెంబరు 30 వరకు గడువు ఉంది కదా అని ఆమె వారితో చెప్పింది. అయినా వారు తీసుకోవటానికి అంగీకరించలేదు. ఈ ఇబ్బందుల్ని మాకెందుకమ్మా అని స్పష్టంగా చెప్పేశారని దీంతోనే నేను నా భర్త వచ్చేంత వరకు అక్కడే ఉండాల్సి వచ్చిందని తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లోని చాలా మంది భారతీయులు ఇలాంటి అవస్థలే పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ఇబ్బందుల్ని షేర్ చేస్తున్నారు.

RBI Governor : రూ.2000 వేల నోట్ మార్చుకోవడానికి తొందరపడొద్దు.. రూ.1000 నోట్ మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

ఇటువంటి పరిస్థితి గురించి గల్ఫ్‌లో ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మాట్లాడుతు..తనకు తెలిసిన చాలా మంది దగ్గర రూ.2000 నోట్లు ఉన్నాయని..వాటిని మార్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. సెలవులు కావటంతో చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వచ్చినవారికి ఇటువంటి ఇబ్బందులు తప్పటంలేదన్నారు.నోట్ల మార్పిడి కుదరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చేతిలో డబ్బు ఉన్నా..ఎటువంటి ఉపయోగానికి పనికిరావటంలేదని తెలిపారు. ఈ పరిస్థితిని భారత ప్రభుత్వం గుర్తించారలని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు