Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

దెయ్యాలు కనిపిస్తాయా? అవి మనుష్యులతో మాట్లాడతాయా? ఓ మహిళ దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం.. ఆ దెయ్యం నుండి విడాకులు కోరడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Ghost Husband :  అసలు దెయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి నిజంగానే మనుష్యులకు కనిపిస్తాయా? ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది. అయితే ఓ మహిళ (woman) దెయ్యాన్ని పెళ్లి (marriage) చేసుకుందట. దాని హింస భరించలేక విడాకులు (divorce) కోరుతోంది. ఈ వింత కథ చదవండి.

intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్

యూకేకి చెందిన రాకర్ బ్రోకార్డ్ (Rocker Brocarde) అనే మహిళ ఎడ్వార్డో (Edwardo) అనే దెయ్యాన్ని పెళ్లి చేసుకుందట. అదీ హాలోవీన్ (Halloween) 2022 వేడుకలో పాడుబడిన ఓ చర్చి వివాహం చేసుకుందట. వృత్తిరీత్యా సింగర్ అయిన ఆమె ఆ దెయ్యం పరిచయం అయిన ఐదు నెలలకి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దాని నుంచి విడాకులు కోరడం విచిత్రంగా అనిపిస్తోంది. తన దెయ్యం భర్త నిత్యం నరకం చూపిస్తున్నాడని అతని నుంచి తప్పించుకోవడానికి భూత వైద్యుడి (Exorcist) దగ్గరకు వెళ్లాలని కూడా అనుకున్నట్లు కూడా ఆమె చెబుతోంది. పెళ్లి ఎంత నరకం అనేది అనుభవం ద్వారా తాను తెలుసుకున్నట్లు బ్రోకార్డ్ చెబుతోంది.

helmetless cops : హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన మహిళా పోలీసులు ఫోటో వైరల్

తను ఎడ్వార్డోను పెళ్లి చేసుకున్న రోజు మార్లిన్ మన్రో (Marilyn Monroe), ఎల్విస్ (Elvis ), హెన్రీ VIII (Henry VII) లు కూడా వేడుకకు వచ్చారని మార్రిన్ మన్రో పట్ల ఎడ్వార్డో అనుచిత వ్యాఖ్యలు చేసాడని బ్రోకార్డ్ చెబుతోంది. ఇక హనీమూన్ రోజు తనను చాలా డిజప్పాయింట్ చేశాడని.. ఐస్ క్రీం తినిపించడానికి చేసిన ప్రయత్నం కూడా సర్వనాశనం అయ్యిందని చెబుతోంది. అతనితో విడిపోవాలనుకుంటున్న నిర్ణయాన్ని కూడా అతను సీరియస్ గా తీసుకోలేదని.. పసిపిల్లలా ఏడుస్తూ తనకు నిత్యం నరకం చూపిస్తున్నాడని ఆమె వాపోతోంది. ఈ కథలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ మహిళ దెయ్యం భర్త కథ సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు