Air India Flight: ఎయిరిండియా విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం.. స్వీడన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ..

అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంకు తృటిలో ప్రమాదం తప్పింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో నుంచి ఆయిల్ లీక్ అయింది. దీనిని గమనించిన పైలట్లు వెంటనే అప్రమత్తమై స్వీడన్‌‌లోని స్టాక్ హోమ్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు.

Air India Flight: అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంకు తృటిలో ప్రమాదం తప్పింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో నుంచి ఆయిల్ లీక్ అయింది. దీనిని గమనించిన పైలట్లు వెంటనే అప్రమత్తమై స్వీడన్‌‌లోని స్టాక్ హోమ్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో 300 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానంలో మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఎయిర్ పోర్టు వద్దకు ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు.

Air India Flight Fire : ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

ఊహించని పరిణామంతో విమానంలోని ప్రయాణీకులు భయాందోళన చెందారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు భయంతో వణికిపోయారు. పైలెట్లు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయంపై డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ అవుతున్నట్లు గుర్తించిన వెంటనే దాన్ని షట్‌డౌన్ చేశారని, వెంటనే స్టాక్ హోమ్ లో విమానాన్ని ల్యాండ్ చేశారని తెలిపారు. అయితే, విమానంలో సాంకేతిక సమస్య ఎలా తలెత్తిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపట్ల ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. సిబ్బంది ఏం చేశారంటే..

ఇదిలాఉంటే.. ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం ముంబైకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో విమానంలో ప్రయాణీకులు, ఎయిర్ లైన్ సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది. విమానం నాలుగు గంటలకుపైగా ఆలస్యం అయిందని, రాత్రి 8గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మూడుసార్లు సమయం మార్చడంతో రాత్రి సుమారు 12.30 గంటలకు ప్రారంభమైందని ప్రయాణీకులు వాపోయారు.

ట్రెండింగ్ వార్తలు