Test rankings-Ravichandran Ashwin: ఆండర్సన్ ను వెనక్కునెట్టి.. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నం.1గా అశ్విన్

 టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అశ్విన్ వెనక్కు నెట్టాడు. ఇటీవలే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆండర్సన్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉండేవాడు.

Test rankings: టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అశ్విన్ వెనక్కు నెట్టాడు. ఇటీవలే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆండర్సన్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉండేవాడు.

ఇవాళ ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో 864 రేటింగ్స్ తో అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఆరు వికెట్ల తీశాడు. ఇక 866 రేటింగ్స్ తో నిన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న జేమ్స్ ఆండర్సన్ ఇప్పుడు 859 రేటింగ్స్ తో రెండో స్థానానికి పడిపోయాడు. ప్యాట్ కమ్మిన్స్ 858 రేటింగ్ తో తన మూడో స్థానాన్ని పదిలపర్చుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ నిన్నటివరకు రెండో స్థానంలో ఉన్న సమయంలోనూ అతడికి 864 రేటింగే ఉంది. ఇప్పుడు కూడా 864 రేటింగ్స్ ఉంది. ఆండర్సన్ తన రేటింగ్ లో 7 పాయింట్లు కోల్పోవడంతో అశ్విన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక, నిన్నటి వరకు 5వ స్థానంలో ఉన్న భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 795 రేటింగ్ తో నాలుగో స్థానానికి ఎగబాకాడు.

పాక్ బౌలర్ షాహిద్ అఫ్రిదీ ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 5వ స్థానానికి చేరాడు. కాగా, టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంక్సింగ్ లోనూ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. జట్టు పరంగా టెస్టుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉంది.
KL Rahul-Memes: కేఎల్ రాహుల్ పై మరోసారి సెటైర్లు.. మీమ్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు

ట్రెండింగ్ వార్తలు