Athia Shetty-KL Rahul : బాలీవుడ్ తారలు, క్రికెట్ స్టార్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఈరోజుల్లో జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా మరో క్రికెట్-బాలీవుడ్ జంట సిద్ధం అవుతుంది. ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి పెళ్లి చేసుకోబోతున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కూతురు అయిన అతియా శెట్టి.. ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో నటించింది. కాగా గత కొంత కాలంగా ఈ భామ కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
ముంబైలో కూడా చాలా సార్లు చెట్టాపట్టాలేసుకొని కెమెరా లెన్స్ కి చిక్కడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ గుసగుసలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి తెలియజేస్తూ సునీల్ శెట్టి.. అతియా, రాహుల్ పెళ్లి వార్తని తెలియజేశాడు. జనవరి 23న ముంబై ఖండాలా లోని ఫామ్‌హౌస్ జహాన్ లో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. వివాహం కారణంగా కేఎల్ రాహుల్ న్యూజిలాండ్ సిరీస్ కి కూడా దూరమయ్యాడు. కాగా ఈ పెళ్లి వేడుకకు కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు అని సమాచారం.
ఇరు కుటుంబ సభ్యుల నుంచి అత్యంత సన్నిహితమైన బంధు మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. దీంతో పెళ్ళికి మొత్తం మీద కేవలం 100 మంది అతిథులు మాత్రమే తేలినట్లు తెలుస్తుంది. అయితే ఈ హాజరయ్యే అతిధులకు కూడా కొన్ని షరతులు పెట్టారు అని సమాచారం. ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలో ‘నో ఫోన్ పాలసీ’ ట్రెండ్ రన్ అవుతుంది. పెళ్ళికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బయటకు పోకుండా మరియు పెళ్లిని ఆనందంగా గడపడమే ఈ పాలసీ ఉద్దేశం. దీంతో సునీల్ శెట్టి.. పెళ్ళికి హాజరయ్యే అతిధులను ఫోన్స్ తీసుకు రావద్దని కోరాడట. కాగా మే నెలలో ఐపీల్ ముగిసిన తరువాత సినీ ప్రముఖులకు, క్రికెటర్లకు కోసం సునీల్ శెట్టి గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.