Biological E : హైదరాబాద్ నుంచి మరో టీకా, మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతుంది. బయోలాజికల్ ‘ఈ వ్యాక్సిన్‌’ 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ లభించింది.

Covid Vaccine : హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతుంది. బయోలాజికల్ ‘ఈ వ్యాక్సిన్‌’ 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ లభించింది. గత నవంబర్‌లోనే తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా.. నవంబర్ 2020లోనే బయోలాజికల్ కరోనా వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ రెండు దశల్లోనూ ఆశించిన ఫలితాలను రాబట్టింది. ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టనుంది. ఇది 18 నుంచి 80 సంవత్సరాల వయస్సులో వ్యాధి నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తిని, భద్రతను అంచనా వేస్తుంది.

మొదటి, రెండు ప్రయోగాల్లో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఫలితాలు తమకు చాలా ఆనందం కలిగించినట్లు బీఈ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. కరోనాపై పోరులో తమది కూడా మరో సమర్థవంతమైన వ్యాక్సిన్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నెలకు 7కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం బీఈ సొంతం. బీఈ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ వచ్చే ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ లో కోవాగ్జిన్, రెమిడిసివిర్ టీకాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇప్పుడు బయోలాజికల్ ఈ కూడా వ్యాక్సిన్ అందుబాటులో తెస్తుండటం నగరానికి గర్వకారణంగా మారనుంది. అంతేగాక, బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ను కూడా తయారు చేయబోతోంది.

Read More : COVID-19 Vaccine : ఒక డోసు తీసుకున్నా…65 శాతం ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి

ట్రెండింగ్ వార్తలు