Dhamaka : రవితేజ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’. మొదటిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రెండోరోజు నుంచి కాసుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. రవితేజ నుంచి ఆశించే మాస్ ఎలెమెంట్స్, ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ ఈ చిత్రంలో పుష్కలంగా కనిపించడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.
Dhamaka : RRR, బాహుబలి తరువాత ఆ రికార్డు సాధించింది ధమాకా..
ఇక అప్పటి నుంచి నిర్మాతలు లాభాలు లెక్కబెట్టుకోవడం మొదలుపెట్టారు. దాదాపు రెండు వారలు పాటు ఈ చిత్రం రోజుకి రూ.1 కోటి తగ్గకుండా కలెక్షన్లు రాబట్టింది. రాజమౌళి సినిమాలు బాహుబలి, RRR తరువాత ఈ రికార్డు అందుకుంది ధమాకా కావడం విశేషం. తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. 14 రోజులకు గాను ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్, షేర్ 50-60 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్లు జరుపుకుంది. దీని ప్రకారం నిర్మాతలకు దాదాపు 30-40 కోట్లు లాభాలు మిగిలినట్లే. ఏదేమైనా ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా మొదటి రూ.100 కోట్ల కొల్లగొట్టిన సినిమాగా కూడా నిలిచిపోయింది. మరో వారం వరకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మూవీ రిలీజ్ లేదు, దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరెంత ధమాకా చూపించే అవకాశం ఉంది.
MassMaharaja @RaviTeja_offl ‘s
Bombarding 1️⃣0️⃣0️⃣ CR+..
Reverberating Rampage ?#DhamakaBlockBuster in Cinemas Now ??#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/Nb82bElsW1
— People Media Factory (@peoplemediafcy) January 6, 2023