Sir Premieres : ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా వాతి. తెలుగులో సార్ సినిమాగా రాబోతుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. బుధవారం నాడు సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సినిమా చదువు ఇంపార్టెన్స్ చెప్తూ ఎంటర్టైన్మెంట్ తో కూడా అందరిని అలరించే విధంగా ఉంటుందని ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖులు చెప్తున్నారు. ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంని ప్రశ్నిస్తూ, చదువు విలువ చెప్పే సినిమా ఇదని, చదువు అందరికి అందేలా చేయాలి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్రయూనిట్ అన్నారు. స్టూడెంట్స్, గురువులు అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా అని అన్నారు.
ఇప్పటికే సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తుండటంతో సార్ సినిమాకి ఇటీవల కాలంలో ఏ సినిమా చేయని సాహసం చేసి ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. సినిమా 17న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే 16న రాత్రి చెన్నై, హైదరాబాద్ లోని థియేటర్లలో ప్రీమియర్ వేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో సార్ సినిమా 3 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అయితే ప్రీమియర్ ప్రకటించిన గంటకే అన్ని షోల టికెట్స్ అయిపోయి షోలు హౌస్ ఫుల్ అవ్వడంతో సార్ సినిమాకు వస్తున్న విశేషదారణ చూసి రిలీజ్ రోజుకి ముందే తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడలో కూడా పలు థియేటర్స్ లో నేడు (ఫిబ్రవరి 16న) రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ షోలు కూడా ప్రకటించిన కొద్దీ సమయానికి టికెట్లు చాలా ఫాస్ట్ గా అయిపోయాయి.
Hyper Aadi : త్రివిక్రమ్ రేంజ్ లో త్రివిక్రమ్ మీదే స్పీచ్ ఇచ్చిన హైపర్ ఆది..
ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అవ్వడంతో సినిమా విజయంపై చిత్రయూనిట్ మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. ధనుష్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు సార్ సినిమా గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో టికెట్లు చాలా ఫాస్ట్ గా అమ్ముడుపోతున్నాయి.
HOUSEFULL BOARDS for added shows, new shows adding! ?#SIR arrived in style ?#SIRMovie PREMIERES TODAY across Andhra Pradesh, Telangana & USA?#SIRMovieOn17Feb ?️ @dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya pic.twitter.com/BKX1Tasp6r
— Sithara Entertainments (@SitharaEnts) February 16, 2023