PC Reddy : ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడు పి చంద్రశేఖరరెడ్డి కన్నుమూత

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో ఎన్నో హిట్ సినిమాలు తీసిన అప్పటి తరం ప్రముఖ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న......

PC Reddy :   ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో ఎన్నో హిట్ సినిమాలు తీసిన అప్పటి తరం ప్రముఖ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న పీసి రెడ్డి ఈ రోజు ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పిసి రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. 1933 అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామంలో జన్మించిన పీసి రెడ్డి 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు.

NBK 107 : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

వి.మధుసూధనరావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా దాదాపు 10 సంవత్సరాలు పని చేశారు. ఆ తర్వాత కృష్ణ, కృష్ణం రాజు, విజయ నిర్మలతో తన మొట్టమొదటి సినిమా 1971లో ‘అనురాధ’ తీశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజులతో ఎన్ని హిట్ సినిమాలని తీశారు. దాదాపు 80 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు పీసి రెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా వయోభారంతో సినిమాలకి దూరంగా చెన్నైలోనే తన స్వగృహంలో ఉన్నారు. ఇవాళ ఉదయం అయన మరణించారు. సీనియర్ నటీనటులు ఆయన మరణ వార్త తెలుసుకొని సంతాపం తెలియచేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు