MS Dhoni long hair : నాటి పాకిస్తాన్ అధ్య‌క్షుడు మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ధోని ఎందుకు మార్చాడు..?

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ది ప్ర‌త్యేక స్థానం. విజ‌య‌వంత‌మైన సార‌థిగా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా చ‌రిత్ర‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.

MS Dhoni : భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ది ప్ర‌త్యేక స్థానం. విజ‌య‌వంత‌మైన సార‌థిగా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా చ‌రిత్ర‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా కీర్తి గ‌డించాడు. నేడు మ‌హేంద్రుడు 42వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా అభిమానులు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌ల‌తో పాటు క్రికెట‌ర్లు మ‌హికి సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేస్తున్నారు.

ధోని ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. త‌న కెరీర్ తొలి నాళ్ల‌లో ఎలా ఉండేవాడో గుర్తుందా..? జుల‌పాల జుట్టుతో ఉండేవాడు. నాటి ధోని హెయ‌ర్ స్టైల్‌కు చాలా మంది అభిమానులే ఉన్నార‌న్న సంగ‌తి తెలిసిందే. అంతఎందుకు ఒక‌ప్ప‌టి పాకిస్తాన్ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్ కూడా ధోని హెయిర్ స్టైల్‌కు ఫిదా అయ్యాడు.

HBD Dhoni: ఎంఎస్ ధోనికి బర్డే విషెస్.. రవీంద్ర జడేజా ట్వీట్ వైరల్.. రాయుడు ఏమన్నాడంటే..

2006లో టీమ్ఇండియా రాహుల్ ద్ర‌విడ్ సార‌థ్యంలో పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఐదు వ‌న్డేల సిరీస్‌ను 4-1తో గెలిచింది. లాహోర్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేను వీక్షించేందుకు అప్ప‌టి పాకిస్తాన్ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ప్ స్టేడియానికి వ‌చ్చాడు. ఆ మ్యాచ్‌లో ధోని దుమ్ములేపాడు. 46 బంతుల్లో 13 ఫోర్ల‌తో 72 ప‌రుగులు చేసి చేజింగ్‌లో భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు.

మ్యాచ్ ముగిసిన త‌రువాత ముఫార‌ప్ మాట్లాడుతూ.. ధోని ఆట‌కు తాను ఫిదా అయిన‌ట్లు చెప్పాడు. అంతేకాకుండా అత‌డి హెయిర్ స్టైల్ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు. భ‌విష్య‌త్తులో కూడా ఇదే హెయిర్ స్టైల్‌ను కంటిన్యూ చేయ‌మ‌ని ధోని ని కోరాడు. అయితే.. 2007లో టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచిన త‌రువాత త‌న జుల‌పాల జ‌ట్టును క‌త్తిరించి అంద‌రికి షాక్ ఇచ్చాడు మ‌హేంద్రుడు.

Sehwag: ధోనికి సెహ్వాగ్ వెరైటీ విషెస్.. 7/7/7తో Happy Birthday ట్వీట్!

ఇప్ప‌టికి స‌స్పెన్స్‌..

ధోని త‌న హెయిర్ స్టైల్ మార్పు వెనుక ఉన్న కార‌ణం ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా ఎవ్వ‌రికి తెలియ‌దు. అంద‌రికీ న‌చ్చిన హెయిర్ స్టైల్ మార్పు వెనుక కార‌ణం ఏంటి అనే దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చాయి. అందులో ఒక‌టి ఏంటంటే.. ధోని హెయిర్ స్టైల్ మార్పుకు కార‌ణం బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే అని. అప్ప‌ట్లో మ‌హి, దీపిక ప్రేమ‌లో ఉన్న‌ట్లు రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో టీమ్ఇండియా ఆడిన చాలా మ్యాచ్‌ల‌ను దీపిక మైదానానికి వ‌చ్చి వీక్షించేది. దీంతో ఆమె కోస‌మే ధోని జుట్టు క‌త్తిరించుకున్నాడు అనే వార్త‌లు వినిపించాయి. అయితే.. అందులో నిజం ఎంత ఉందో తెలియ‌దు. ఇక మ‌హేంద్రుడు కూడా త‌న హెయిర్ స్టైల్ మార్పు వెనుక ఉన్న కార‌ణాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌పెట్ట‌లేదు.

Virender Sehwag : ధోని కిచిడీ సెంటిమెంట్‌ తెలుసా..? ఆ ప్ర‌పంచ‌క‌ప్ మొత్తం అదే తిన్నాడు.. ఎందుకంటే..?

ట్రెండింగ్ వార్తలు