Project K : ప్రాజెక్ట్ K సినిమాకు హాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్..

జులై 20 నుంచి 23 వరకూ జరుగుతున్న హాలీవుడ్ ఈవెంట్ శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ K మూవీకి సంబందించి టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేస్తామని, ఆ ఈవెంట్ లో పాల్గొనబోతున్నామని, ఆ ఈవెంట్ లో పాల్గొనే ఫస్ట్ ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ K అని అనౌన్స్ చేసింది టీం.

Hollywood Actors Strike Effect on Project K Movie Comic Con Event

Project K Movie: కామిక్ కాన్(Comic Con) కి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తోందని తెగ సంతోషపడిపోతున్నారు ప్రాజెక్ట్ K టీమ్. హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్‌లో ప్రాజెక్ట్ K ని ప్రొజెక్ట్ చేసి వరల్డ్ వైడ్ గా ఫేమస్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారు చిత్రయూనిట్. కానీ ప్రాజెక్ట్ K ప్లాన్ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. 500కోట్లకు పైగా బడ్జెట్ తో, హై క్వాలిటీ విజువల్స్ తో, మైథలాజికల్ సైంటిఫిక్ యాక్షన్ మూవీగా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకుంది.

జులై 20 నుంచి 23 వరకూ జరుగుతున్న హాలీవుడ్ ఈవెంట్ శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ K మూవీకి సంబందించి టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేస్తామని, ఆ ఈవెంట్ లో పాల్గొనబోతున్నామని, ఆ ఈవెంట్ లో పాల్గొనే ఫస్ట్ ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ K అని అనౌన్స్ చేసింది టీం. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజెస్ తో పాటు సెలట్రిబీలతో సందడిగా జరుగుతుందనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ K టీం అనుకుంది జరుగుతుందా లేదా అనే సందేహం వస్తుంది ఇప్పుడు. అందుకు కారణం హాలీవుడ్ యాక్టర్స్ సమ్మె.

Baby Collections : యూత్‌లో ‘బేబీ’ క్రేజ్.. సెకండ్ డే కలెక్షన్స్ కూడా ఓ రేంజ్..

హాలీవుడ్ లో ఇప్పటికే రైటర్స్ అసోసియేషన్ సమ్మె జరుగుతుంటే గత రెండు రోజులుగా యాక్టర్స్ కూడా సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ యాక్టర్స్ సమ్మె సెగ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లకు తగిలింది. ఈ స్ట్రైక్ తో ఆల్మోస్ట్ అన్ని సినిమాల షూటింగ్ లు, ప్రీమియర్లు, ప్రమోషన్లు.. అన్నీ ఆగిపోయాయి. హాలీవుడ్ సెలబ్రెయితీలు చాలా మంది ఈ స్ట్రైక్ కి మద్దతు తెలపడంతో ప్రాజెక్ట్ K సినిమాకి ఈ స్ట్రైక్ సెగ తగిలేలా కనిపిస్తోంది. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్స్ డిస్నీ, వార్నన్ బ్రదర్స్, సోనీ, యూనివర్శల్, నెట్ ఫ్లిక్స్, హెచ్ బీ వో.. లాంటి పలు సంస్థలు ఈ సమ్మె వల్ల ఈ సంవత్సరం కామిక్ కాన్ లో పాల్గొనడం లేదని కావడం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. దీంతో ప్రాజెక్ట్ k హాలీవుడ్ ప్రమోషన్స్ కి ఎఫెక్ట్ పడనుంది.

ట్రెండింగ్ వార్తలు