supreme court : అటువంటి అమ్మ నాకొద్దు..నేను మాట్లాడను అంటూ..తల్లి పెట్టిన చిత్రహింసల్ని కోర్టు చెప్పిన 27 ఏళ్ల కొడుకు..

అటువంటి అమ్మ నాకొద్దు..నేను మాట్లాడను అంటూ..తల్లి పెట్టిన చిత్రహింసల్ని కోర్టు కళ్లకు కట్టినట్లుగా చెప్పాడు 27 ఏళ్ల కొడుకు.. సుప్రీంకోర్టు జడ్జిలు బుజ్జగించినా తల్లితో మాట్లాడనని..

supreme court : ‘మా అమ్మతో మాట్లాడాలని లేదు..ఆమె పెట్టిన చిత్రహింసలు నేనింకా మర్చిపోలేదు.నా బాల్యాన్ని నరకంలోకి నెట్టేసిన నా తల్లితో నేను మాట్లాడను..ఆ గడ్డు రోజుల్ని గుర్తు చేసుకోవాలని లేదు’ అంటూ దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పాడు 27 ఏళ్ల యువకుడు. 27 ఏళ్ల యువకుడు ఆ మాటలు చెప్పటంతో సుప్రీంకోర్టు జడ్జిలు కూడా బుజ్జగించి చెప్పారు. తల్లితో మాట్లాడాలని. అయినా ఆ యువకుడు వినలేదు. ఆ పాతరోజుల్ని గుర్తు చేసుకోదలచులేదు..నాకు మా అమ్మ వద్దు..ఆమెతో మాట్లాడను అంటూ తేల్చి చెప్పాడు. తల్లి తండ్రీ విడాకుల కేసు సందర్భంగా కోర్టుకు తన తల్లి తనను చిన్ననాట పెట్టిన చిత్రహింసలను కళ్లకు కట్టినట్లుగా చెప్పాడా 27 ఏళ్ల యువకుడు. మా అమ్మ నన్ను చిన్నపిల్లాడిని అని కూడా చూడకుండా దారుణంగా కొట్టేది..బాత్రూంలో పడేసి తాళం వేసేది.. ఆమెతో మాట్లాడను అని తేల్చి చెప్పాడు సుప్రీంకోర్టుకు.

Also read : Lock down in China: చైనాలో కరోనా లాక్ డౌన్: ఆహార కేంద్రాలను దోచుకువెళ్తున్న ప్రజలు

తల్లీ తండ్రీ విడాకులు తీసుకున్న సందర్భంగా భర్త దగ్గర ఉంటున్న తన కొడుకు తనతో మాట్లాడేలా చేయాలని తల్లి కోరగా ఇటువంటి మాటలు చెప్పాడా యువకుడు. తన తల్లిదండ్రులు విడివిడిగానే ఉంటున్నారని..20 ఏళ్లుగా విడాకుల కోసం కొట్లాడుకుంటున్నారని.. తెలిపాడు. తన బాల్యంలో అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యానని సదరు యువకుడు కోర్టుకు తన ఆవేదన వ్యక్తం చేశాడు.

సోమవారం (ఏప్రిల్ 11,2022) సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్ ల ధర్మాసనం ముందుకు వచ్చిన విడాకుల కేసు విచారణ సందర్భంగా బాధిత యువకుడు తన బాధనంతా వెళ్లగక్కాడు. కానీ..కన్నతల్లి నీకోసం అలమటిస్తోంది.. అమ్మతో మాట్లాడాలంటూ జడ్జిలు ఆ యువకుడిని దాదాపు 45 నిమిషాల పాటు బుజ్జగించే ప్రయత్నం చేసినా.. అతడు ససేమిరా అన్నాడు. అంటే ఆ యువకుడికి తల్లి పట్ల ఎటువంటి ముద్ర పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు చిన్ననాట కన్నతల్లి పెట్టిన బాధలకు.

తండ్రితో ఉంటున్న అబ్బాయితో మాట్లాడేందుకు అవకాశం ఇప్పించాల్సిందిగా యువకుడి తల్లి తరఫు లాయర్.. కోర్టును కోరారు. దీంతో జస్టిస్ చంద్రచూడ్.. మీ అమ్మతో మాట్లాడు అంటూ సూచించారు. కానీ అతను వినలేదు. తల్లితో మాట్లాడాలని తనకు అస్సలు లేదని తేల్చి చెప్పాడు. అయినా జడ్జిలు అతనిని సముదాయించారు. బుజ్జగించారు. అయినా ఆ 27 ఏళ్ల ఆ యువకుడు తల్లితో మాట్లాడటం ఆమెను చూడటం కూడా ఇష్టం లేదని చెప్పాడు. తనకు చిన్నప్పుడు జరిగిన సంఘటనలను కోర్టు కళ్లకు కట్టినట్టు వివరించాడు.

Also read : PM MoDi : ‘WTO అనుమతిస్తే ప్రపంచానికి ఆహారం అందించటానికి భారత్ సిద్ధంగా ఉంది’..

ఏడేళ్ల వయసున్నప్పుడు తనను తీవ్రంగా కొట్టేదని, బాత్రూంలో పడేసి తాళం వేసేదని గుర్తు చేసుకున్నాడు. అమ్మతో మాట్లాడినప్పుడల్లా ఆ గడ్డు పరిస్థితులు గుర్తుకొచ్చేవని ఆవేదన వ్యక్తంచేశాడు. ఇకపై ఆమెతో మాట్లాడడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. ఏడేళ్ల కొడుకుపై ఏ తల్లి అంత టార్చర్ పెడుతుందు..అటువంటి ఆమెతో ఎవరికైనా ఎలా మాట్లాడాలని అనిపిస్తుంది? అని ప్రశ్నించాడు. తన తండ్రి ఇప్పటివరకు తనను ఒక్క దెబ్బ కూడా వేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపాడు.

తల్లి తరఫు న్యాయవాది మాత్రం సదరు యువకుడు చేసిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. అతను అవన్నీ కట్టుకథలని..బహుశా తండ్రి అతనిని అలా మార్చేసి ఉంటాడని..అలాంటివేవీ జరగలేదని వాదించారు. న్యాయవాది వాదనను ధర్మాసనం అడ్డుకుంది. ‘‘ఆ యువకుడేం చిన్నపిల్లాడుకాదని..ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే విజ్ఞత వచ్చిన వయసు ఉన్నవాడే అని వ్యాఖ్యానించింది. యువకుడి తండ్రి తరఫు వాదించిన అడ్వొకేట్ అర్చనా పాఠక్ దవే.. అసలు కన్న కొడుకు కస్టడీ కోసం ఏనాడూ ఆ తల్లి కోర్టుకొచ్చిన సందర్భాలు లేవని కోర్టుకు వివరించారు. యువకుడి తండ్రి ఎలాంటి గొడవల్లేకుండా ప్రశాంతంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని, వీలైనంత త్వరగా విడాకులను మంజూరు చేయాలని కోర్టును కోరారు.

Also read : Sri Lanka Crisis : ‘మా వల్ల కాదు..విదేశాల నుంచి తీసుకున్న అప్పులను కట్టలేం’ చేతులెత్తేసిన శ్రీలంక సంచలన ప్రకటన

ఆ వాదనలను తల్లి తరఫు లాయర్ కొట్టిపారేశారు. విడిపోయి ఒంటరిగా బతకడం తన క్లయింట్ కు ఇష్టం లేదని, విడాకులు ఇవ్వవద్దని కోరారు. కాగా, 1988లో ఆ ఇద్దరు దంపతులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2002 నుంచి విడాకుల కోసం దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు