Kaikala Satyanarayana : ఆ పాత్ర కోసం ఎన్టీఆర్‌కే సవాలు విసిరిన కైకాల.. గెలిచింది ఎవరు?

60 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించిన 'కైకాల సత్యనారాయణ'.. మొదటిలో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా చేసేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ చొరవతో సహాయనటుడిగా కెరీర్ మొదలుపెట్టగా, దర్శకుడు విఠలాచార్య సలహాతో విలన్ గా మారాడు. అప్పటినుంచి విలన్ గా బిజీ అయిన కైకాల.. ఒక పాత్ర చేయడం కోసం ఎన్టీఆర్ తో గొడవ పడడమే కాకుండా సవాలు కూడా విసిరారు అంటా.

Kaikala Satyanarayana : తెలుగు సినీ పరిశ్రమలో.. తరువాతి తరాలకి ఒక గైడ్‌గా నిలిచిన వ్యక్తులు చాలా తక్కువమంది, అందులో ఒకరు ‘కైకాల సత్యనారాయణ’. తన నటనా చాతుర్యంతో హీరోలతో సమానంగా స్టార్‌డమ్ అందుకున్న కైకాల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అయన మరణంతో తెలుగు పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి కి లోనయ్యింది.

KGF : తెలుగు వాళ్లకి KGF సినిమాని పరిచయం చేసింది కైకాల సత్యనారాయణే..

60 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించిన కైకాల.. మొదటిలో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా చేసేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ చొరవతో సహాయనటుడిగా కెరీర్ మొదలుపెట్టగా, దర్శకుడు విఠలాచార్య సలహాతో విలన్ గా మారాడు. అప్పటినుంచి విలన్ గా బిజీ అయిన కైకాల.. ఒక పాత్ర చేయడం కోసం ఎన్టీఆర్ తో గొడవ పడడమే కాకుండా సవాలు కూడా విసిరారు అంటా.

1967లో వచ్చిన ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో విషాద ఛాయలు ఉన్న ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర కైకాల చేస్తాను అన్ని అడిగారు అంటా. అయితే విలన్ గా రాణిస్తున్న కైకాల ఆ సెంటిమెంటల్ పాత్ర చేయగలడా అనే సందేహంతో ఎన్టీఆర్ వద్దు అన్నారు. దీంతో కైకాల.. రెండు రోజులు షూట్ చేయండి, నేను చేసింది నచ్చకపోతే పంపించేయండి అంటూ ఎన్టీఆర్ కి సవాలు విసిరారు. ఇక చేసేది లేక ఆ పాత్రని కైకాలతో చేయించిన ఎన్టీఆర్.. ఆ తరువాత కైకాల నటన చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అందుకే కైకాల సత్యనారాయణ గారిని నవరసనటసార్వబౌవం అన్ని అనేది.

ట్రెండింగ్ వార్తలు