Amigos Teaser : మరో వైవిధ్యమైన కథతో కళ్యాణ్ రామ్.. అమిగోస్ టీజర్ రిలీజ్!

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న తరువాత చేస్తున్న సినిమా 'అమిగోస్'. ఇక ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీం.. సినిమాలోని హీరో పాత్రలను ఒకొకటిగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఇక నేడు మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Amigos Teaser : నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న తరువాత చేస్తున్న సినిమా ‘అమిగోస్’. ఎప్పటి లాగానే ఈ సినిమాలో యాక్షన్ ఉంటూనే, కథలో వైవిధ్యాన్ని కూడా చూపిస్తున్నాడు ఈ నందమూరి హీరో. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలతో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. ఇక ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీం.. సినిమాలోని హీరో పాత్రలను ఒకొకటిగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఇక నేడు మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Kalyan Ram: కీలక షెడ్యూల్‌ను ముగించేసిన కళ్యాణ్ రామ్ ‘డెవిల్’!

నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు చేయగా.. ఒకటి అమాయకమైన పాత్ర, మరొకటి మోడరన్ లుక్ లో కనిపిస్తుంది. ఇక మూడో పాత్ర ‘మైఖెల్’ విలన్ అని తెలుస్తుంది. ప్రపంచంలో మనిషిని పోలిన వ్యక్తులు మరొకరు ఉంటారు అనే కాన్సెప్ట్ వస్తుంది ఈ సినిమా. ఇక కథ విషయానికి వస్తే.. మైఖెల్ అనే వ్యక్తికి ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తప్పించుకోడానికి ప్రపంచంలో తనని పోలిన వ్యక్తిలు కోసం వెతుకుతూ మిగిలిన ఇద్దరి దగ్గరకి చేరుకుంటాడు.

కలిసిన మూడో వ్యక్తి వల్ల మిగిలిన ఇద్దరు ఎటువంటి ప్రమాదాలు ఎదురుకోవాల్సి వచ్చింది. అసలు ఆ మైఖెల్ ఎవరు అనే దాని సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఫిబ్రవరి 10న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు