Tuck Jagadish : అలాగైతే నాకు నేనే బ్యాన్ చేసుకుంటాను..

‘టక్ జగదీష్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో తనను విమర్శించిన ఎగ్జిబిటర్స్ గురించి నాని చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి..

Tuck Jagadish: ‘టక్ జగదీష్’.. కెరీర్ స్టార్టింగ్ నుండి వివాదాలకు దూరంగా ఉండే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడం గురించి కొద్ది రోజులుగా వివాదాలు చెలరేగాయి. దీంతో ఇండస్ట్రీ వర్గాల వారికి వివరణ ఇస్తూ.. తెలుగు ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ.. వేరే దారిలేక ఓటీటీని ఎంచుకున్నామని చెప్పారు మేకర్స్.

Nani : వేరే దారి లేదు.. ఓటీటీలోనే ‘టక్ జగదీష్’.. ప్రకటించిన నిర్మాతలు..

ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయ్యింది. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్‌ జగదీష్‌’. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటించగా.. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. బుధవారం ‘టక్ జగదీష్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తనను విమర్శించిన ఎగ్జిబిటర్స్ గురించి నాని మాట్లాడుతూ.. ‘‘నా సినిమా బ్యాన్ చేస్తామని అన్నారు. అయితే వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే.. వాళ్ల బాధలను నేను అర్థం చేసుకున్నాను.. అయితే బయట పరిస్థితులు బాగుండి నా సినిమా థియేటర్లో రిలీజ్ కాకపోతే నాకు నేనే బ్యాన్ చేసుకుంటాను.. తెలుగు ప్రేక్షకులు మనకు పెద్ద బలం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎక్కువ షూటింగ్స్ జరుగుతున్నవి మన దగ్గరే.. ప్రేక్షకుల నుంచి మన ఇండస్ట్రీకి మంచి సపోర్ట్ ఉంది. డైరెక్టర్ శివ ఎమోషన్స్‌ను బాగా హ్యాండిల్ చెయ్యగలడు. సినిమా చూసిన వాళ్లకు ఆనంద బాష్పాలు వస్తాయి.. పండగ నాడు ఒక మంచి సినిమా చూశాం అనుకుంటారు అందరూ.
ఇందులో మన బాల్యం అనేది చుపించాం.. తప్పకుండా ‘టక్ జగదీష్’ మిమ్మల్నందర్నీ ఆకట్టుకుంటాడు’’ అన్నారు.

Nani on Theatres : థియేటర్స్‌పై హీరో నాని షాకింగ్ కామెంట్స్

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘‘నాని కోసం ఎవరు ఏదో మాట్లాడుతున్నారు. కానీ, నాని తన ప్రతి సినిమానీ ప్రసాద్ ఐమాక్స్‌లో 8.30 షో కి గేటు దగ్గర నుంచొని ఆడియన్స్ ఫీలింగ్స్‌ను వాచ్ చేస్తూ ఉంటారు. అలాంటి నాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తారా? నేను, నాని ఇద్దరం కూడా ‘టక్ జగదీష్’ సినిమా థియేటర్స్‌లో ఆ సీన్‌‌‌కి అలా రియాక్ట్ అవుతారు.. ఈ సీన్‌కి విజిల్స్ వేస్తారు అని చెప్పుకుంటూ పొంగి పోయేవాళ్ళం.. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అనగానే చాలా డీలా పడ్డాం.. మేము నిర్మాతలకు కూడా ఓటీటీ వద్దు వెయిట్ చేద్దాం.. థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దాం.. నా రెమ్యునరేషన్, నాని రెమ్యునరేషన్ కూడా తగ్గించి ఇవ్వండి అన్నాం.. కానీ, కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ నుంచి కొనసాగుతూ ఉంది.. ఇక ఫైనల్‌‌‌గా రిలీజ్ విషయాన్ని నిర్మాతలకు వదిలేశాం’’ అన్నారు.

ట్రైలర్ విషయానికొస్తే..
ఏ మాత్రం డౌట్ లేకుండా పక్కా హిట్ అనిపించేలా ఉంది ట్రైలర్. భూదేవి పురం అనే ఊరిలో భూతగాదాల నుంచి.. మంచి కోసం పోరాడే వ్యక్తి కుటుంబాన్ని, వారి మధ్య బంధాలను చూపిస్తూ.. క్లుప్తంగా కథ చెప్పడంతో పాటు ఎమోషన్స్ క్యారీ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ట్రైలర్ చివర్లో చిన్న పాప ‘బాబాయ్.. నువ్వు మా ఫ్యామిలీ కాదా’ అని అడిగితే.. కంటతడి పెట్టుకుంటే.. కవర్ చేసుకోవడానికి నాని గాగుల్స్ పెట్టుకునే షాట్ చాలా ఎమోషనల్‌గా అనిపించింది.

ట్రెండింగ్ వార్తలు