Noisefit Twist SmartWatch : రూ. 2వేల లోపు ధరకే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నాయిస్‌ఫిట్ ట్విస్ట్ స్మార్ట్‌వాచ్.. మరెన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

Noisefit Twist SmartWatch : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ నాయిస్ (Noise) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. కాలింగ్ స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా నాయిస్ వేరబుల డివైజ్‌ల్లో నోయిస్‌ఫిట్ ట్విస్ట్‌ని యాడ్ చేసింది.

Noisefit Twist SmartWatch : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ నాయిస్ (Noise) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. కాలింగ్ స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా నాయిస్ వేరబుల డివైజ్‌ల్లో నోయిస్‌ఫిట్ ట్విస్ట్‌ని యాడ్ చేసింది. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో మాత్రమే వస్తుంది. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. వందకు పైగా వాచ్ ఫేస్‌లు, మెన్స్ట్రువల్ హెల్త్ ట్రాకింగ్ టూల్‌ను కలిగి ఉంది. 2022లో నాయిస్ భారత మార్కెట్లో నంబర్ వన్ స్మార్ట్ వేరబుల్ బ్రాండ్‌గా అవతరించింది.

కంపెనీ భారతీయ వేరబుల్ మార్కెట్‌ను 25 శాతం వాటాను అందించింది. నాయిస్‌ఫిట్ ట్విస్ట్ స్మార్ట్‌వాచ్‌పై నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి మాట్లాడుతూ.. ప్రతి లాంచ్‌తో యూజర్లకు వారి అవసరాలను తీర్చగల ఫీచర్-రిచ్ వినూత్న ప్రొడక్టులను అందించడమే తమ కంపెనీ లక్ష్యమని అన్నారు. నోయిస్‌ఫిట్ ట్విస్ట్ ఎర్గోనామిక్ డిజైన్‌తో ప్రత్యేకమైన రౌండ్ డయల్, అడ్వాన్స్‌డ్ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్, స్ట్రెయిన్-ఫ్రీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆదర్శవంతమైన జీవనశైలి తోడుగా కొత్త-ఏజ్ హస్లర్‌లకు సరైన ఆప్షన్‌గా అందిస్తుంది.

Read Also : Samsung Galaxy F04 Sale : శాంసంగ్ గెలాక్సీ F04 సేల్ మొదలైందోచ్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Noisefit ట్విస్ట్ ధర ఎంతంటే? :
Noisefit ట్విస్ట్ డివైజ్ ధరతో రూ. 1999లతో వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, వైన్, సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, గోల్డ్, పింక్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో వస్తుంది. నాయిస్‌ఫిట్ ట్విస్ట్‌ను అమెజాన్, నాయిస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Noisefit Twist with bluetooth calling feature launched under Rs 2000

నాయిస్‌ఫిట్ ట్విస్ట్ స్పెసిఫికేషన్‌లు ఇవే :
నోయిస్‌ఫిట్ ట్విస్ట్ 1.38 అంగుళాల TFT రౌండ్ డిస్‌ప్లేను 240*240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 246 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం డిస్ప్లే స్ట్రెయిన్-ఫ్రీ 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడా వస్తుంది. అదనంగా, యూజర్లు ఇన్-బిల్ట్ స్పీకర్‌లు, మైక్రోఫోన్ సపోర్టుతో తక్కువ బ్యాటరీ వినియోగంతో స్టేబుల్ లాగ్-ఫ్రీ కాల్‌లను ఆస్వాదించవచ్చు. డయల్-ప్యాడ్ నుంచి కాల్ చేసేందుకు ఇటీవలి కాల్‌ల లాగ్‌కు యాక్సెస్‌ను కూడా అనుమతిస్తుంది. NoiseFit Twist IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

ఇంటర్నల్ నాయిస్ హెల్త్ సూట్‌ను కలిగి ఉంది. SPO2 స్థాయిలు, హృదయ స్పందన రేటు, నిద్ర, శ్వాస విధానాలు, కార్యాచరణ స్థాయిలు వంటి అన్ని ముఖ్యమైన అంశాలను ట్రాక్ చేయవచ్చు. హెల్త్ మానిటరింగ్, 100 స్పోర్ట్స్ మోడ్‌లు, 100+ వాచ్ ఫేస్‌లతో పాటు ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్‌తో కూడా వస్తుంది. స్మార్ట్‌వాచ్ ఇటీవలి కాల్ లాగ్‌లకు యాక్సెస్ ఇస్తుంది. Noise Buzz ద్వారా గరిష్టంగా 10 కాంటాక్టులను స్టోర్ చేయగలదు. ఈ డివైజ్‌తో అత్యంత ఇంటరాక్టివ్‌గా పనిచేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : True Folding Smartphone : శాంసంగ్, ఒప్పోకు పోటీగా మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త ట్రూ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు