NTR 100 Years : ఎన్టీఆర్‌తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ మూవీని రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..

NTR 100 Years : నందమూరి అండ్ మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతుంటాయి. దీంతో సినిమా పరంగా ఈ రెండు కుటుంబాల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంటుంది. అయితే ఈ రెండు కుటుంబ వారసులను ఒకే ఫ్రేమ్ మీదకు తీసుకు వచ్చి రాజమౌళి RRR అనే సినిమాని తెరకెక్కించాడు. జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఈ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలుసు.

NTR 100 Years : ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించారో తెలుసా? పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్..

అయితే ఈ రెండు కుటుంబాల కలయికలో గతంలోనే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ ని పలకరించింది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి (Chiranjeevi) కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సరిగ్గా 2 ఏళ్ళ ముందు చేశారు. 1981 ఏప్రిల్ 1న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ లాయర్ గా నటిస్తే, చిరంజీవి క్లబ్ డాన్సర్ గా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో చిరంజీవి ఎన్టీఆర్ చెల్లెలా భర్తగా నెగిటివ్ రోల్ లో నటించడం గమనార్హం.

NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!

మూవీ లాస్ట్ సీన్ వరకు చిరు నెగటివ్ రోల్ ని పోషించి చివరిలో రౌడీల ఆట కట్టించేందుకు ఎన్టీఆర్ తో కలిసి ఫైట్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. విశేషం ఏంటంటే రాఘవేంద్రరావు శిష్యుడు అయిన రాజమౌళి దర్శకత్వంలో మళ్ళీ నందమూరి అండ్ మెగా ఫ్యామిలీ నటులు కలిసి నటించారు.

NTR : ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్.. శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..

కాగా ఈ ఏడాది ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు వేడుక జరుగుతుంది. దీంతో గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ (Balakrishna) మొదలు పెట్టాడు. ఇటీవల విజయవాడలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు