RRR : ఇలాంటి ఎంట్రీ ఎప్పుడూ చూడలేదు.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ వీడియో

తాజాగా RRR సినిమా మరోసారి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్‌ ఇచ్చే వైల్డ్‌ ఎంట్రీ సీన్‌ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సీన్ చూసి..............

NTR :  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా RRR. ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని సాధించింది ఈ సినిమా. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ సినిమాకి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఇక RRR సినిమా ఓటీటీలో విడుదల అయ్యాక మరింత పేరు సంపాదించింది. విదేశీ ప్రేక్షకులకి ఈ సినిమా తెగ నచ్చేసింది. వివిధ దేశాల్లోని ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమని RRR మెప్పించింది. పలువురు హాలీవుడ్ రచయితలు, టెక్నీషియన్స్ RRR సినిమాని పొగుడుతూ ట్వీట్స్ చేశారు.

Sravan Bhargavi : సింగర్ శ్రావణి భార్గవిపై అన్నమయ్య వంశస్థులు సీరియస్.. కోర్టుకు వెళ్తామని హెచ్చరిక..

తాజాగా RRR సినిమా మరోసారి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్‌ ఇచ్చే వైల్డ్‌ ఎంట్రీ సీన్‌ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సీన్ చూసి థియేటర్లో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఓ విదేశీ ప్రేక్షకుడు ఈ సీన్‌ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి.. ”నేను ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చూశాను. 29 మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు కూడా చూశాను. కానీ ఇప్పటివరకు ఇలాంటి అద్భుతమైన ఎంట్రీ సీన్ ఏ సినిమాలో చూడలేదు” అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయి మరింతమంది దీనిపై ట్వీట్స్ చేశారు. అతి తక్కువ సమయంలో ట్విట్టర్లో ఈ వీడియో 12 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. గత రెండు రోజుల నుంచి ఈ వీడియో, ఎన్టీఆర్ పేరు, RRR ట్విట్టర్లో మారుమ్రోగిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు