BBB: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో మల్టీస్టారర్ల హవా నడుస్తుంది. సమవుజ్జీలైన హీరోలు.. ఒకే కుటుంబం నుండి వచ్చే హీరోలతో మల్టీస్టారర్ సినిమాలకి అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. అందుకే ఇప్పుడు బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఆర్ఆర్ఆర్, ఆచార్య, బంగార్రాజు, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Sukumar-Vijay: లెక్కల మాస్టారితో రౌడీబాయ్.. వీర సైనికుడి విధ్వంసమే!
బాలయ్య అంటే బోయపాటి.. బోయపాటి అంటే బాలయ్య అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇద్దరూ కలిస్తే.. రికార్డుల వేటే అన్నది అఖండతో మరోమారు స్పష్టమైంది. బోయపాటి ఏం చెప్పినా చేసేసేందుకు బాలయ్య రెడీ. అందుకే అఖండ కథ కూడా పూర్తిగా వినకుండానే బాలయ్య ఒకే చెప్పాడట. ఇక బన్నీతోనూ అలాంటి అనుబంధమే ఉంది. సరైనోడుతో ఓ అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి. ఇప్పుడు మరోసారి త్వరలోనే బన్నీతో కలిసి బోయపాటి మరో సినిమా చేయబోతున్నాడు.
RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!
అయితే, బోయపాటి దగ్గర ఓ మల్టీస్టారర్ కథ ఉందట. అది బాలయ్య, బన్నీలకు పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలతో కలిసి బోయపాటి క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదే ప్రశ్నకి బోయపాటి కూడా పాజిటివ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ ఇది జరగదు అది జరగదు అని లేదు. ఏదైనా జరగొచ్చు అని హింట్ ఇచ్చేశాడు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో కానీ.. ప్రస్తుతానికైతే అభిమానులు ధూమ్ ధామ్ జాతరే చేస్తున్నారు.