Anubhavinchu Raja: ప్రామిసింగ్ ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ తెచ్చిన రాజ్ తరుణ్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్రెడీ టీజర్ తోనే ఫుల్ బిందాస్ సినిమా...

Anubhavinchu Raja: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్రెడీ టీజర్ తోనే ఫుల్ బిందాస్ సినిమా అవుతుందని అంచనాలు సెట్ చేశాడు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న తరుణంలో ఈ సినిమా ట్రైలర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రామిసింగ్ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ తెచ్చాడు. ట్రైలర్ ఆధ్యంతం.. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ అని చూపించేశారు.

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయలు గెలిచినా చేతికి వచ్చేది ఇంతే..

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ముందుగా రాజ్ తరుణ్ రోల్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. హీరోయిన్ కాశీష్ ఖాన్ తో కెమిస్ట్రీ, ఫన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సిటీ నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించిన స్టోరీ సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. అజయ్ రాజ్ తరుణ్ ల మధ్య క్లాష్ వాటితో సందర్భానుసారం జెనరేట్ అయ్యే కామెడీలతో ట్రైలర్ మంచి ఫన్ ఫిల్లెడ్ గా అనిపిస్తుంది. హీరో కాస్ట్యూమ్ నుండి మాటల వరకు.. గోదావరి జిల్లాల స్లాంగ్ తో సహా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ కనిపిస్తుంది.

అమెరికాలో మైక్ టైసన్‌తో కలిసి రచ్చ చేస్తున్న ‘లైగర్’ టీం

నవంబర్ 26న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పి సినిమాస్ పై సుప్రియ యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది. రాజ్ తరుణ్ ను హీరోగా చేసిన ఉయ్యాలా జంపాలా సినిమాను కూడా అన్నపూర్ణ వారే నిర్మించగా ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ కు మరోసారి అన్నపూర్ణ వాళ్ళు హిట్ ఇచ్చి మళ్ళీ హీరోగా నిలబెడతారో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు