Rajinikanth: సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీ కాంత్, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది..? ఇంకెలా ఉంటుంది.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అవుతుందని వేరేగా చెప్పాలా..
Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!
ప్రస్తుతం ఈ క్రేజీ కాంబో గురించి వార్తలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు కూడా పలుసార్లు రజినీ – రాజమౌళి సినిమాపై అనేక వార్తలు వచ్చాయి. ఇటీవలే రాజమౌళి, రజినీను కలిసి కథ చెప్పడం.. చేతిలో ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక కలిసి సినిమా చేద్దామని చెప్పడం కూడా జరిగిపోయిందంటున్నారు తమిళ తంబీలు.
RRR Movie : RRR మూవీ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?
ఎన్టీఆర్ – రామ్ చరణ్‌లతో జక్కన్న రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు. రజినీకాంత్ – శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి, మహేష్ బాబుతో దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినియా చెయ్యబోతున్న సగతి తెలిసిందే. దాని తర్వాత రజినీ – రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.