CM KCR : సమైక్యవాదులు నాపై లెక్కలేనన్ని దాడులు చేశారు, నన్ను భయపెట్టారు- సీఎం కేసీఆర్

CM KCR : కొంతమంది మూర్ఖులు అమరుల స్థూపంపై నన్ను విమర్శించారు. యునిక్ గా ఉండాలని.. శాశ్వతంగా ఉండేలా.. డిజైన్ చేశాం.

Telangana Martyrs Memorial : సమైక్యవాదులు తనపై లెక్కలేనన్ని దాడులు చేశారని, తనను భయపెట్టారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అయినా, తాను భయపడలేదని, వెనుకడుగు వేయలేదని, ఉద్యమాన్ని ముందుకు సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం, అమరజ్యోతిని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

” ఈరోజు.. రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు. సంతోషం ఒక పాలు. విషాదం రెండు పాళ్లు ఉన్నాయి. నాటి రాజకీయ కుట్ర కోణం కారణంగా.. ఎన్నో బలిదానాలు జరిగాయి. అనుభవించని బాధలు లేవు. నాటి పోరాటంలో టీఎన్ జీవోస్ పాత్ర ఎంతో గొప్పది. పిడికెడు మందితో ఉద్యమాన్ని మొదలుపెట్టాం. జయశంకర్ సార్.. ఆజన్మ తెలంగాణ వాది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వెనకడుగు వేయలేదు. ఉద్యమాన్ని సజీవంగా ఉండేలా చాలా మంది జీవం పోశారు.

Also Read..Revanth Reddy: అప్పట్లోగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ అమరజ్యోతి ఎల్లకాలం గుండెల్లో ఉండేలా నిర్మించాం. తొలిదశ.. మలిదశలోని.. అమరవీరుల ఫోటోలను పెడతాం. ఉద్యమం అంటే ఆందోళనలు, బస్సులు తగలపెట్టడం కాదు. అది తెలంగాణ నిరూపించింది. రాజీనామాలను వ్యూహంగా మార్చి ఉద్యమం చేశాం.
హింసకు దూరంగా ఉద్యమం నడిపాము.

సమైక్యవాదులు లెక్కలేని విధంగా నాపై దాడులు చేశారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేశా. ఆనాడు.. నిమ్స్ లో నన్ను ఎన్నో విధాలుగా భయపెట్టారు. చివరి నిమిషం వరకు నాడు సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకున్నాము.

Also Read..Banswada Constituency: బాన్సువాడలో ప్రచారంలోకి దిగిపోయిన పోచారం.. ఆ సెంటిమెంట్ నుంచి గట్టెక్కుతారా?

కొంతమంది మూర్ఖులు అమరుల స్థూపంపై నన్ను విమర్శించారు. యునిక్ గా ఉండాలని.. శాశ్వతంగా ఉండేలా.. డిజైన్ చేశాం. రాష్ట్రానికి ఎవరు వచ్చినా.. అమర జ్యోతికి నివాళి అర్పించాలని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మీ వద్ద తెలంగాణ ఘట్టాలు ఉంటే.. ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు. తెలంగాణ పరిపాలనకు స్ఫురణ వచ్చేలా.. ఈ అమర జ్యోతిని ఏర్పాటు చేసుకున్నాం. సమతామూర్తి అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అమర జ్యోతి, సచివాలయానికి మధ్యన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం” అని కేసీఆర్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు