Karnataka Muslim Students: బురఖా ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకున్న ప్రిన్సిపాల్

కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలతో ముస్లిం విద్యార్థినిలు తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ఇన్ని రోజులుగా లేని నష్టం ఇప్పుడే ఎందుకంటూ విద్యార్థినిలు ప్రశ్నిస్తున్నారు

Karnataka Muslim Students: కళాశాలకు బురఖాలో వచ్చిన ముస్లిం యువతులను సాక్షాత్తు కాలేజీ ప్రిన్సిపాల్ గేటు వద్దనే అడ్డుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో గురువారం వెలుగుచూసింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపూర్‌లోని ప్రీ-యూనివర్సిటీ కళాశాలలో ఈఘటన చోటుచేసుకుంది. చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు..మతపరమైన దుస్తులు ధరించడం ఏంటంటూ గత కొన్ని రోజులుగా కర్ణాటక వ్యాప్తంగా విద్యార్థులే నిరసనలకు దిగుతున్నారు. తోటి విద్యార్థుల మతాచారాలను కించపరచడం తమ ఉద్దేశం కాదన్నా ఒక వర్గం విద్యార్థులు.. చదువు అందరికి సమానం అయినపుడు.. విద్యార్థులు సైతం సమానంగా మెలగాలని నినాదాలు చేస్తున్నారు.

Also read: Toyota Hilux: కొత్త పికప్ ట్రక్ బుకింగ్ లు నిలిపివేసిన టొయోటా, కారణం?

గత నెలలో ఉడిపిలోని ఒక కళాశాలలో బురఖా ధరించిన విద్యార్థినీలను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించగా.. బుధవారం భద్రావతి పట్టణంలోనూ కాషాయ కండువాలు కప్పుకున్న కొందరు విద్యార్థులు, బురఖా ధరించి కళాశాలకు వస్తున్న ముస్లిం విద్యార్థినిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు బురఖాలు ధరించి వస్తే తాము తరగతులకు వచ్చేది లేదంటూ విద్యార్థులు స్పష్టం చేశారు. ఇక గురువారం నాడు.. కుందాపూర్‌లోని ప్రీ-యూనివర్సిటీ కళాశాలలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో..రంగంలోకి దిగిన ప్రిన్సిపాల్ బురఖా ధరించిన విద్యార్థినీలను గేటు వద్దే అడ్డుకున్నారు.

Also read: Kodanad Estate Murder Case: నాబెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి సార్.. కోర్టును వేడుకున్న హత్య,దోపిడీ కేసు నిందితుడు

కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య పరిణామాలతో ముస్లిం విద్యార్థినిలు తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ఇన్ని రోజులుగా లేని నష్టం ఇప్పుడే ఎందుకు వచ్చిందంటూ విద్యార్థినిలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనలపై మరొక వాదన కూడా ప్రచారంలో ఉంది. ఉడిపిలోని స్థానిక బీజేపీ నేతలు, కుందాపూర్ ఎమ్మెల్యే.. ఆదేశాల మేరకు కళాశాలల్లో బురఖాను నిషేధించినట్లు పలువురు కళాశాల ప్రతినిధులు చెప్పుకొచ్చారు. స్థానిక నేతలకు రాష్ట్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also read: Amazon Jeff Bezos: జెఫ్ బెజోస్ భారీ పడవ కోసం చారిత్రక వంతెనను కూల్చనున్న నెదర్లాండ్స్

ట్రెండింగ్ వార్తలు