Tamilnadu : మొదటి మహిళా బస్సు డ్రైవర్‌ను అభినందించిన ఎంపీ కనిమొళి .. ఉద్యోగం నుంచి తీసివేసిన యాజమాన్యం

ఎంపీ కనిమొళి అభినందించారని ఓ మహిళా బస్సు డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తీసివేసింది యాజమాన్యం. రాష్ట్రంలోనే మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిన మహిళను ఉద్యోగం నుంచి తీసివేసింది బస్సు యాజమాన్యం.

tamilnadu first bus Women driver sharmila : తమిళనాడు (Tamil Nadu )లో మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిని షర్మిల(Sharmila )కు షాక్ ఇచ్చింది. తమిళనాడులో ప్రైవేటు బస్సు (private bus )యాజమాన్యం. అధికార పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi)షర్మిలను అభినందించారు. ఆ తరువాత వెంటనే షర్మిలపై వేటు వేసింది సదరు బస్సు యాజమాన్యం.

అసలు విషయం ఏంటంటే..డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi)కోయంబత్తూరు (Coimbatore)వెళ్లారు. ప్రైవేట్‌ సంస్థకు చెందిన బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి సోమనూర్ మర్గంలో తమిళనాడులో మొదటి బస్సు డ్రైవర్ గా పేరొందిన వడవల్లి షర్మిల అదే రూట్ లో డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం (జూన్ 23,2023)ఎంపీ కనిమొళి షర్మిల నడిపే బస్సు ఎక్కారు. గాంధీపురం బస్టాండ్ లో బస్సు ఎక్కిన ఎంపీ కనిమొళి పీలబేడుకు బయలుదేరారు. ఈ సందర్భంగా కనిమొళి రాష్ట్రానికి మొదటి బస్సు డ్రైవర్ గా నలిచిన షర్మిలను అభినందించారు. ఆమెకు వాచీ బహుమతిగా ఇచ్చారు.

2024 Elections: కాంగ్రెస్‭కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఆప్ వ్యవహారం అటు ఇటుగా ఇలాగే ఉంది

అదే బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్న ట్రైనీ కండక్టర్ అన్నాతై కనిమొళిని..ఆమె వెంటన వచ్చినవారి టికెట్ అడిగారు. దానికి షర్మిల ఎంపీ ఉచిత ప్రయాణం..టికెట్ తీసుకోవద్దు అని అన్నారు. కానీ అప్పటికే తాను అప్పటికే టికెట్ తీసుకున్నానని కనిమొళి చెప్పారు. ఈక్రమంలో డ్రైవర్ షర్మిలకు..కండక్టర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మహిళా కండక్టర్‌ డ్రైవర్ షర్మిల తనపై అనుచితంగా ప్రవర్తించిందంటూ ఫిర్యాదు చేసేందుకు షాళిని సంస్థ కార్యాలయానికి వెళ్లింది.

దీంతో సదరు బస్సు యజమాన్యం షర్మిలను..అదే సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఆమె తండ్రి మహేశ్ లను విచారణ కోసం పిలిచింది. షర్మిలకు చీవాట్లు పెట్టింది యాజమాన్యం. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని తెలిపింది. దీంతో షర్మిల షాక్ అయ్యాంది. ‘‘నేనేం తప్పుచేశానని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. దానికి యాజమాన్యం నీ పాపులారిటీ కోసం తరచు బస్సులో ప్రయాణించేందుకు సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నావు..తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్నావంటూ చీవాట్లు పెట్టింది. తాను అటువంటిదేమీ చేయలేదని షర్మిల చెప్పినా యాజమాన్యం వినిపించుకోలేదు. దీంతో ఆమె ఇక వాదించలేక తిరిగి వచ్చేసింది.

2024 Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్.. అప్పుడే సీట్ల పంపకానికి పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

అలా అధికార పార్టీ మహిళా ఎంపీ ఓ మహిళా డ్రైవర్ ను అభినందించినందుకు ఆమె ఉద్యోగం పోయింది. ఈ ఘటనలో షర్మిల మీడియాతో మాట్లాడుతు.. ఉదయం 5.30గంటలకు డ్యూటీ ఎక్కుతాను..రాత్రి 11.30ల వరకు డ్యూటీలోనే ఉంటాను. దీని కోసం రోజుకు రూ.1200లు వస్తాయి. ఎంతో ఇష్టంగా బస్సు డ్రైవర్ జాబ్ చేస్తున్నాను..కానీ నన్ను ఈ కారణంతో ఉద్యోగం నుంచి తీసివేస్తారని అనుకోలేదంటూ వాపోయారు.

కాగా బతుకు తెరువు కోసం షర్మిల ఎంతో కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుంది. బస్సును పురుషులే కాదు మహిళలు కూడా నేర్పుగా నడపగలరని నిరూపించింది. ఎంతో పట్టుదలతో తండ్రి సహకారంతో కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్న షర్మిల లైసెన్స్‌ పొందింది. ఆతరువాత ఇదే సంస్థలో ఉద్యోగం కోసం అప్లై చేసుకుని ఉద్యోగం సంపాదించింది, అలా. . షర్మిల గాంధీపురం-సోమనూరు రూట్‌లో బస్సు నడుపుతోంది షర్మిల.  కాగా కొద్ది రోజుల క్రితం షర్మిల నడిపిన బస్సులో సౌత్ కోయంబత్తూరు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాస్ కూడా ప్రయాణించారను బస్సు యాజమాన్యం వెల్లడించింది.

Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడవు అగరుబత్తీ .. విశేషాలు ఎన్నో

 

ట్రెండింగ్ వార్తలు