India vs West Indies 2nd ODI: డ్రింక్ బాయ్ అవతారమెత్తిన కోహ్లీ.. టీమిండియాకు గట్టి షాకిచ్చిన వెస్టిండీస్

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో టీమిండియా జట్టు ఓటమి పాలైంది.

IND vs WI 2nd ODI: కరీబియన్ జట్టు టీమిండియాకు గట్టి షాకిచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే శనివారం రాత్రి కెన్సింగటన్ ఓవల్ స్టేడియంలో జరిగింది. తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టును మట్టికరిపించిన భారత్ జట్టు.. రెండో వన్డేలో బోల్తాపడింది. విండీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55), శుభ్‌మన్ గిల్ (34) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేక పోయారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన కరీబియన్ జట్టు కేవలం 182 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

IND vs WI 2nd ODI : భారత్ 181 ఆలౌట్.. Updates In Telugu

టాస్ ఓడిన టీమిండియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. హార్ధిక పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ నిలకడగా ఆడటంతో 90 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. దీంతో రెండో వన్డేలోనూ టీమిండియా విజయం ఖాయమని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ, ఊహించని రీతిలో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తరువాత కేవలం 91 పరుగుల వ్యవధిలోనే భారత్ జట్టు పది వికెట్లు కోల్పోయింది. 90 పరుగుల వద్ద ఒక్క వికెట్ కూడా కోల్పోని భారత్ జట్టు.. 113 పరుగుల వద్దకు వచ్చేసరికి ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపటికే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అక్షర్ పటేల్ (1), సంజు శాంసన్ (9), కెప్టెన్ హార్ధిక్ పాండ్య (7), జడేజా (10), సూర్యకుమార్ (24), శార్దూల్ ఠాకూర్ (16) ఇలా తక్కువ స్కోర్ కే భారత్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా 40.5 ఓవర్లు ఆడి 181 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో మోదీ, షెఫర్డ్ చెరో మూడు వికెట్లు, జోషెఫ్ రెండు వికెట్లు తీశారు. సీల్స్, కరియా ఒక్కో వికెట్ పడగొట్టారు.

Babar Azam : బ్రా ధరించిన బాబర్ ఆజామ్..! ప‌రుగో ప‌రుగు.. అరె ఏంట్రా ఇది..

ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆటగాళ్లు ఆచితూచి ఆడుతూ విజయాన్ని అందుకున్నారు. షై హోప్ (63), కార్టీ (48), కైల్ మేయర్స్ (36) పరుగులతో రాణించడంతో కేవలం 36.4 ఓవర్లలోనే విండీస్ జట్టు భారత్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. రెండో వన్డేలో విండీస్ జట్టు విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ మంగళవారం (ఆగస్టు 1)న జరుగుతుంది.

Rajinikanth : కావ్య బాధ‌ప‌డుతుంటే చూడ‌లేక‌పోతున్నా.. మార‌న్ వెంట‌నే ఈ ప‌ని చేయండి

డ్రింక్ బాయ్‌గా విరాట్ కోహ్లీ..

రెండో వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు జట్టు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. వీరి స్థానాల్లో సంజు శాంసన్, అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చారు. రెండో వన్డేలో విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. డ్రింక్ బాయ్ అవతారరం ఎత్తాడు. భారత్ ఇన్నింగ్స్ లో 37వ ఓవర్ అనంతరం డ్రింక్స్ విరామంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో కలిసి డ్రింక్స్ తీసుకొని కోహ్లీ మైదానంలోకి వెళ్లాడు. క్రీజులో ఉన్న శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్‌లకు డ్రింక్స్ అందించాడు.

ట్రెండింగ్ వార్తలు