Narayana Arrest : బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ అరెస్ట్

బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. (Basara IIIT Narayana Arrest)

Narayana Arrest : బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు దిగిన సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై నారాయణ ఫైర్ అయ్యారు. ఆమె చదువు రాని మంత్రి అని నారాయణ మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ.. హిట్లర్ స్థావరం కాదన్నారు. విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులే ‌మావోయిస్టులు అని విరుచుకుపడ్డారు.

బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT-Triple IT)లో విద్యార్థుల ఆందోళన మూడో రోజూ(గురువారం) కొనసాగుతోంది. మెయిన్ గేటు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆర్‌జీయూకేటీ రెండో గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. మద్దతుగా వచ్చిన విద్యార్థుల కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 12 డిమాండ్లతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.(Basara IIIT Narayana Arrest)

Basara IIIT Students: రెండో దశ చర్చలు విఫలం.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనంటూ విద్యార్థుల డిమాండ్..

8వేల మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి వర్సిటీలో నెలకొన్న సమస్యలపై గొంతెత్తారు. వర్సిటీ ప్రధాన గేటు దగ్గర రోజంతా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వర్షంలో తడుస్తూనే ఆందోళన కంటిన్యూ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ వర్సిటీకి వచ్చి.. సమస్యలు పరిష్కరించే దాక ఆందోళన ఆపబోమని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికగానూ వేల మంది విద్యార్థులు తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ హమీ ఇచ్చినా.. వైస్‌ చాన్సలర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. మాటలు చెప్పొద్దని.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని సోషల్‌ మీడియా వేదికగా బదులిస్తున్నారు.

కాగా, బాసర ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ సతీష్‌ కుమార్‌ను నియమించారు. అయితే, డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని విద్యార్థులు తేల్చి చెప్పారు. వీసీతోనే సమస్యలు పరిష్కారం కానప్పుడు డైరెక్టర్ నియామకంతో ఉపయోగం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు చెబుతున్నారు.

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బయటకు రాకుండా..

కాగా.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్‌ కారే తెలిపారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. డైరెక్టర్‌ నియామకంపై విద్యార్థులకు తెలిపామన్నారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపేశామనడం అవాస్తవమని ఏఎస్పీ వివరించారు. వారికి ఆహారం, నీళ్లు అందుతున్నాయని వివరించారు. కాగా.. తమ 12 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు