Tollywood Movies : టాలీవుడ్.. జనవరి హిట్టు, ఫిబ్రవరి ఓకే.. మరి మార్చ్ సంగతేంటి?

023 టాలీవుడ్ బాక్సాఫీస్ కు రెండు పెద్ద బ్లాక్ బస్టర్స్ తో శుభారంభం దక్కింది. 2023లో గడిచిన ఈ రెండు నెలల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు దాదాపు 10 సినిమాలకు పైగా రిలీజైతే వాటిలో 6 సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అవి కాక చిన్న సినిమాలు కొన్ని..................

Tollywood Movies :  2023 టాలీవుడ్ బాక్సాఫీస్ కు రెండు పెద్ద బ్లాక్ బస్టర్స్ తో శుభారంభం దక్కింది. 2023లో గడిచిన ఈ రెండు నెలల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు దాదాపు 10 సినిమాలకు పైగా రిలీజైతే వాటిలో 6 సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అవి కాక చిన్న సినిమాలు కొన్ని రిలీజయ్యాయి. సంక్రాంతి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు రెండూ హైయస్ట్ కలెక్షన్స్ తో దుమ్మురేపేశాయి. ఈ ఇద్దరు హీరోలూ జనవరిని ఫుల్ గా ఆక్యుపై చేసేశారు. మంచి కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ కి న్యూ ఇయర్ ని ఘనంగా ఓపెన్ చేశారు. ఇక అదే సంక్రాంతి సీజన్ లో రిలీజైన వారసుడు, తెగింపు డబ్బింగ్ సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. ఆ తర్వాత రిలీజైన సుధీర్ బాబు ‘హంట్’ మూవీ డిజాస్టర్ అయింది.

ఫిబ్రవరిలో ధనుష్, కళ్యాణ్ రామ్, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం, సుహాస్ సినిమాలతో పాటు పలు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు, తమిళ్ రెండు చోట్లా భారీ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ కొట్టింది. ఇప్పటికే దాదాపు 80 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి 100 కోట్లకు పరుగులు తీస్తుంది. ఇక యువ హీరో సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ మంచి విజయం సాధించి, ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించి దాదాపు 10 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించింది. ఈ చిన్న సినిమాకు లాభాలు కూడా గట్టిగానే వచ్చాయి. ఇక కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా పర్వాలేదనిపించినా చిన్న బడ్జెట్ కావడంతో కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ ‘అమిగోస్‌’ సినిమా పర్వాలేదనిపించినా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇక సందీప్ కిష‌న్ మైఖేల్ సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. చిన్న సినిమాలు ప్రత్యర్థి, పాప్ కార్న్‌, ది రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం, సింధూరంతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

Debina Bonnerjee : బుల్లితెర నటికి అరుదైన వైరస్.. ముందు పట్టించుకోలేదు.. ఇప్పుడేమో..

ఇప్పుడు అందరి దృష్టి మార్చ్ సినిమాలపై ఉంది. మార్చ్ లో ముఖ్యంగా నాని ‘దసరా’ సినిమాపై హైయస్ట్ అంచనాలు ఉన్నాయి. మార్చ్ ఎండింగ్ లో రాబోయే ఈ సినిమా మొత్తం నెలకే హైలైట్ సినిమా అవుతుందని ఊహిస్తున్నారు. ఫస్ట్ వీక్ లో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’, బలగం, ఇన్ కార్ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెండో వారంలో ఆది సాయికుమార్ నటించిన సీఎస్ఐ సనాతన్, బెల్లంకొండ గణేశ్ ‘నేను స్టూడెంట్ సర్’, మూడో వారంలో ఉపేంద్ర కబ్జా, నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, భూతద్దం భాస్కరనారాయణ, కార్తికేయ హీరోగా చేసిన బెదురులంక సినిమాలు రిలీజ్ కానున్నాయి. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో, అన్ని చిన్న, మీడియం సినిమాలు కావడంతో ఒక్క దసరా సినిమాకు తప్ప మిగిలిన వాటికి థియేటర్స్ కి జనాలు ఏ మాత్రం వస్తారో అని సందేహిస్తున్నారు. బాలీవుడ్ తో పోలిస్తే ఇప్పటివరకు మంచి ఫలితాలనిచ్చిన టాలీవుడ్ మరి మార్చ్ నెల రిజల్ట్ ఎలా ఇస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు