Balakrishna : బాలయ్య అన్ స్టాపబుల్ రికార్డ్.. ఐఎండిబి టాప్ 10 షోలలో స్థానం

తాజాగా ఈ షో అరుదైన రికార్డు సృష్టించింది. సినిమాలకు, షోలకు రేటింగ్ ఇచ్చే ఐఎండిబి వెబ్ సైట్ లో 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాప్ 10 షోలలో స్థానం సంపాదించింది.

Balakrishna :   బాలకృష్ణ యాంకర్ గా మొదలు పెట్టిన షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుంది. సినీ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్ళతో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ళ లైఫ్ లోని చాలా మూమెంట్స్ ని ప్రేక్షకులకి తెలియచేస్తున్నారు. ఈ షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ప్రోగ్రాంకి భారీ రెస్పాన్స్ వస్తుంది. అభిమానులే కాక ప్రేక్షకులంతా బాలయ్యని ఈ షో హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు అంటూ పొగిడేస్తున్నారు.

ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు. త్వరలో మహేష్ బాబు కూడా రానున్నారు. ఈ షో సెలబ్రిటీలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. తాజాగా ఈ షో అరుదైన రికార్డు సృష్టించింది. సినిమాలకు, షోలకు రేటింగ్ ఇచ్చే ఐఎండిబి వెబ్ సైట్ లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాప్ 10 షోలలో స్థానం సంపాదించింది. ఈ విషయాన్నీ ఆహా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

AP Cinema Ticket Rates : సినిమా టికెట్ రేట్ల గురించి చాలా మాట్లాడాలి.. సపరేట్‌గా ప్రెస్‌మీట్ పెడతాను

IMDB టాప్ 10 రియాలిటీ టీవీ, టాక్ షో కేటగిరీ లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ నిలిచింది. ఈ షోలో ఇంకా ప్రసారం కావాల్సిన ఎపిసొడ్ లు ఉన్నాయి. ఈ లోపే 9.2 రేటింగ్ తో టాప్ 10లో నిలవడంతో అభిమానులతో పాటు ఆహా టీం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు షోలలో కూడా బాలయ్య రికార్డ్స్ సృష్టిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు