Jr NTR: తారక్ రెండు నెలల విరామం వెనుక అసలు నిజమేంటి?

భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి హీరోలు చేయాల్సిన పని పూర్తవగా..

Jr NTR: భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి హీరోలు చేయాల్సిన పని పూర్తవగా ఇక ప్రచార కార్యక్రమాలు మాత్రమే వీరు చేయాల్సింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తికాగానే రామ్ చరణ్ వెంటనే మిగతా సినిమాలను షిఫ్ట్ అయిపోయాడు. కానీ, ఎన్టీఆర్ మాత్రం సందడి చేయడం లేదు. ఎన్టీఆర్ రెండు మూడు సినిమాలకు ఒకే చెప్పినా ఒక్కటి కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు.

Keerthy Suresh: బ్యూటీ విత్ టాలెంట్ మహానటి!

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రారంభ కార్యక్రమాలు కూడా పూర్తి కాగా.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకి ఒకే చెప్పాడు. ఇవి కాకుండా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు బాలీవుడ్ సీనియర్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి.

Aishwarya Rai: మరోసారి తల్లి కాబోతున్న ప్రపంచ సుందరి?

కానీ, ప్రస్తుతం ఏ ఒక్కటీ సెట్స్ మీద లేదు. దీనికి కారణం ఎన్టీఆర్ మరో రెండు నెలల పాటు విరామం తీసుకోనున్నాడని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తెలుగులో ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో పాటు హిందీలో ఓ షోకు వీక్లీ గెస్ట్ గా ఒక ఎపిసోడ్ కు మాత్రమే హాజరు కానున్నాడు. ఇంత బిజీ హీరో ఇంత గ్యాప్ తీసుకోవడం వెనక అసలు కారణం ఏంటనే చర్చలు కూడా షరా మామూలే కదా.

Prabhas: రెబల్‌ స్టార్ పాన్‌ వరల్డ్ సినిమా.. కొరియన్ భామతో రొమాన్స్!

అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమా వ్యూహాలలో తారక్ కూడా భాగం కానున్నాడని.. తెలుగుతో పాటు ఇతర బాషలలో ఆర్ఆర్ఆర్ ప్రచార బాద్యతలలో తారక్ పాలుపంచుకునేందుకు ఇతర సినిమాల జోలికెళ్లడం లేదని సన్నిహితులు చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు