BiggBoss 6 Day 14 : మరో ఎలిమినేషన్.. సండే తమన్నా స్పెషల్ ఎపిసోడ్..

బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి శనివారం షాని సల్మాన్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం కూడా మరో ఎలిమినేషన్ ఉంటుందని ముందే ప్రకటించాడు నాగార్జున. శనివారం సీరియస్ గా జరిగిన ఎపిసోడ్ సండే ఫండేగా జరిగింది. బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సండే ఎపిసోడ్ లో తమన్నా.............

BiggBoss 6 Day 14 :  బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి శనివారం షాని సల్మాన్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం కూడా మరో ఎలిమినేషన్ ఉంటుందని ముందే ప్రకటించాడు నాగార్జున. శనివారం సీరియస్ గా జరిగిన ఎపిసోడ్ సండే ఫండేగా జరిగింది. బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సండే ఎపిసోడ్ లో తమన్నా వచ్చి అందర్నీ అలరించింది. స్టేజిపై బబ్లీ బౌన్సర్ ట్రైలర్ ని వేసి అందులో తమన్నా ట్రాన్స్ఫర్మేషన్ ని నాగార్జున అభినందించారు. ఆ తర్వాత తమన్నా ఇంటి సభ్యులని ఎంటర్టైన్ చేయడానికి హౌస్ లోపలికి వెళ్ళింది.

హౌస్ లో ఉన్న అబ్బాయిలు హౌస్ లో ఉండే అమ్మాయిల్లో తమకి రక్షణగా ఉండే లేడీ బౌన్సర్ ని ఎంచుకోవాలి అని చెప్పాడు నాగార్జున. దీంతో ఒక్కో జెంట్ కంటెస్టెంట్ ఒక్కో అమ్మాయిని లేడీ బౌన్సర్ గా ఎన్నుకున్నారు. అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్యని ఎంచుకోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని కాసేపు ఆటపట్టించాడు నాగార్జున. ఎక్కువమంది లేడీ బౌన్సర్ గా గీతూని ఎంచుకున్నారు. తర్వాత తమన్నా అబ్బాయిల్లో నుంచి రోహిత్, రేవంత్, అర్జున్, సూర్యని తన బౌన్సర్లు గా ఎంచుకుంది. ఈ నలుగురు తమ ట్యాలెంట్స్ తో తమన్నాని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించారు.

Chiranjeevi-Nagarjuna: బాలీవుడ్ రిలీజ్ కి చిరు “నో”, నాగార్జున “యస్”..

ఇక తమన్నా బయటకి వచ్చేసిన తర్వాత నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. కంటెస్టెంట్స్ తో గజిబిజి గానా అనే గేమ్ ఆడిస్తూ మధ్యలో నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ పక్కన పెట్టారు. నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ చివరికి ఆదిరెడ్డి, అభినయలు మిగిలారు. దీంతో వారిద్దరిలో ఎవర్ని ఎలిమినేట్ చేస్తారా అని కాసేపు ఉత్కంఠ నెలకొంది. స్టేజి మీద ఉన్న నాగార్జున ఒక చిన్న టాస్క్ తో అభినయ ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. దీంతో అభినయ హౌస్ లోంచి బయటకి వచ్చింది.

ఆ తర్వాత అభినయ వేదికపైకి రాగా నాగార్జున హౌస్ లో ఆమె జర్నీ చూపించారు. అభినయ మాట్లాడుతూ.. హౌస్ లో ఫైమా, చంటి, బాలాదిత్య, శ్రీసత్య, సూర్య లని హానెస్ట్ అని, రేవంత్ మాత్రం కన్నింగ్ అని, మిగిలిన వారంతా వారి స్ట్రాటజిలతో గేమ్ బాగా ఆడుతున్నారు అని చెప్పి ఎమోషనల్ ఫీల్ అయి బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు