Rana Daggubati : రానాకి పాపా పుట్టిందా?? వైరల్ అవుతున్న మిహికా పోస్ట్.. అసలు మ్యాటర్ ఏంటంటే??

ఇటీవల కొన్ని రోజుల నుంచి మిహికా ప్రెగ్నెంట్ అని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మిహికా బయట కనపడినప్పుడు కొంచెం బొద్దుగా ఉండటంతో అందరూ తనని ప్రెగ్నెంట్ అనుకున్నారు. తాజాగా శనివారం నాడు మిహికా..............

Rana Daggubati :  టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి కరోనా సమయంలో 2020లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నాడు. మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు రానా. పెళ్లైన కొత్తలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ తర్వాత ఎక్కువగా ఇద్దరూ కలిసి ఎక్కడా కనపడలేదు.

ఇటీవల కొన్ని రోజుల నుంచి మిహికా ప్రెగ్నెంట్ అని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మిహికా బయట కనపడినప్పుడు కొంచెం బొద్దుగా ఉండటంతో అందరూ తనని ప్రెగ్నెంట్ అనుకున్నారు. తాజాగా శనివారం నాడు మిహికా ఓ పాపని ఎత్తుకొని తన సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసింది. దీంతో అందరూ మిహికాకి పాప పుట్టిందేమో అని రానా, మిహికా దంపతులకి కంగ్రాట్స్ చెప్పారు.

BiggBoss 6 Day 62 : గీతూ, శ్రీహాన్, రేవంత్, ఇనయాలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్ సీరియస్ మోడ్..

అయితే పోస్ట్ సరిగ్గా చూసిన తర్వాత షాక్ అయ్యారు. మిహికా ఓ పాపని ఎత్తుకున్న ఫొటో షేర్ చేసి.. ” నా బ్యూటిఫుల్ ఏంజెల్ తో మొట్టమొదటి ఫొటో, నా మేనకోడలు” అని పోస్ట్ చేసింది. దీంతో తాను మిహికా పాప కాదు మేనకోడలు అని తెలిసి అవాక్కయ్యారు. అయితే ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు