The Ghost Movie: ఆరు నూరైనా.. అదే రోజు దిగుతానంటోన్న ‘ది ఘోస్ట్’!

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

The Ghost Movie: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ షూటింగ్ ముగించేసిన నాగార్జున

కాగా, ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. ఈ వార్తతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారనే విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్, ఈ సినిమా రిలీజ్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను ఏదేమైనా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.

The Ghost: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ది ఘోస్ట్’

దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో నాగ్ పాత్ర సరికొత్తగా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. కాగా ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో తెలియాలంటే అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు