Liger Movie : లైగర్ సినిమా ఫ్లాప్ అయితే.. విలేఖరి ప్రశ్నకి విజయ్ దేవరకొండ ఏమని చెప్పాడో తెలుసా?

ఈ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి విజయ్ దేవరకొండని ఒకవేళ లైగర్ సినిమా ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి అని అడిగారు. ఆ ప్రశ్నకి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కానీ విజయ్ దేవరకొండ..............

 

Liger Movie :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇండియా అంతా తిరిగేస్తున్నారు. తాజాగా ముంబైలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి విజయ్ దేవరకొండని ఒకవేళ లైగర్ సినిమా ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి అని అడిగారు. ఆ ప్రశ్నకి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కానీ విజయ్ దేవరకొండ చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు.

 

విజయ్ దేవరకొండ ఈ ప్రశ్నకి సమాధానమిస్తూ.. ”నాకు సినిమా కంటే కూడా ప్రేక్షకులు, వారి ప్రేమే ముఖ్యం. ఇలాంటి చిన్న విషయాలకు నేను కోపం తెచ్చుకొను. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల క్రితం అడిగితే మీ మీద అరిచేసేవాడినేమో. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ. కానీ గత కొన్ని రోజులుగా నాకు కోపం రావట్లేదు. అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రేమను నేను మర్చిపోలేను. లైగర్‌ ప్రమోషన్స్‌ లో భాగంగా దేశమంత తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నాపై ప్రేమని కురిపిస్తున్నారు. నేను వాళ్ళ కోసమే పని చేస్తున్నాను. నాకు ప్రేక్షకులే ముఖ్యం” అని తెలిపారు.

AmalaPaul : ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది

అయితే ఈ ఆన్సర్ ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడని, ఇది కూడా అలాంటి ట్రిక్ అని అంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే ఏం చేస్తారు అని అడిగితే అది వదిలేసి ఫ్యాన్స్, ప్రేమ అంటూ మాట్లాడాడు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమాకి ఏ ఫలితం వస్తుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు