Rickshaw Puller success story: రిక్షావాలా ఇప్పుడు మిలియనీర్.. IIT, IIM గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలిస్తున్నాడు..

జీవితంలో ఓటమి ఎదురైతే చాలు చాలామంది డీలా పడిపోతారు. ఇంక ఏమీ చేయలేమని నిరుత్సాహపడతారు. చదువుకునే స్థోమత లేక రిక్షావాలాగా మారి కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఓ కుర్రాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని ఓ కోట్లకు పడగలెత్తిన కంపెనీ సీఈవో అయ్యాడు. అతని సక్సెస్ స్టోరి చదవండి.

Rickshaw Puller success story :  జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో ఎవరికీ తెలీదు. ఒకప్పుడు రిక్షా (Rickshaw) నడిపి, కూరగాయలు అమ్మిన ఓ కుర్రాడు ఈరోజు కోట్లకు (millionaire) పడగలెత్తాడు. అంతేనా తన కంపెనీలో IIM, IIT చదివిన వారికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీ మీకు తెలుసుకుంటే మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు.

Judge Delivered In Govt Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా న్యాయమూర్తి ప్రసవం.. ఆదర్శంగా నిలిచిన జడ్జి

బీహార్ కి (bihar) చెందిన దిల్‌ఖుష్ కుమార్ ఏడేళ్ల క్రితం ఒక సాధారణమైన కుర్రాడు. తండ్రి బస్సు డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. కుమార్ ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక చదువు ఆపేశాడు. తండ్రి దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటూనే రిక్షా తోలడం మొదలుపెట్టాడు. సమయం దొరికినపుడు కూరగాయలు (vegetables) కూడా అమ్మేవాడు. జీవితంలో కష్టపడి ఏదైనా సాధించాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుందని నమ్మేవాడు. అతనికి ఆరోజు రావడానికి 7 సంవత్సరాలు పట్టింది.

KMM RAMYA : చదువు,సాగు..కుటుంబానికి అన్నీ తానై నిలిచిన చదవుల తల్లి రమ్య

29 ఏళ్ల దిల్ ఖుష్ కుమార్ ఇప్పుడు ‘రాడ్‌బెజ్’ (RodBez) కంపెనీ సీఈవో. అంత ఈజీగా కాలేదండోయ్. ముందు ఒక సెకండ్ హ్యాండ్ నానో కారుతో ట్యాక్సీ సర్వీస్ బిజినెస్ మొదలుపెట్టాడు. 7 నెలలు వరకూ కష్టాలు ఎదుర్కున్నాడు. ఆ తరువాత కొంతమంది ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అలా 4 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇతని కంపెనీ నార్మల్ ట్యాక్సీ సర్వీస్ లాగ కాకుండా ప్రయాణికులకు 50 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేయడానికి సర్వీసులు అందిస్తుంది. త్వరలోనే బీహార్ దాటి కూడా ఈ కంపెనీ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతోంది. రాడ్‌బెజ్ కంపెనీలో IIT, IIM గ్రాడ్యుయేట్స్ ఉద్యోగులుగా ఉన్నారు. ఇక కుమార్ కంపెనీ డ్రైవర్లకు నెలకు 55000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకూ జీతాలు అందిస్తోంది. గడిచిన కొన్ని నెలల్లో రాడ్ బెజ్ కంపెనీ యాప్ ను 50,000 మంది వరకూ డౌన్ లోడ్ చేసుకోవడం గమనార్హం.

వ్యవసాయం చేస్తూ.. ఆదర్శంగా నిలిచిన హీరోయిన్!

జీవితంలో ఏదైనా మొదలుపెట్టి రెండు అడుగులు వేయగా ఓటమి ఎదురైతే చాలామంది డీలా పడిపోతారు. కేవలం ఇంటర్ వరకూ చదువుకున్న కుమార్ ఆత్మస్థైర్యంతో అడుగులు ముందుకు వేసి, ఎన్ని అవాంతరాలు వచ్చిన ధైర్యంగా నిలబడ్డాడు. మరెంతమందికో తన కంపెనీలో ఉద్యోగాలిచ్చి దారి చూపిస్తున్నాడు. జీవితం అయిపోయింది.. ఇంకేం సాధించలేం అనుకునేవారికి దిల్‌ఖుష్ కుమార్ స్టోరి ఆదర్శంగా నిలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు