BJP Leaders on Rahul Gandhi: లధాఖ్‭లో రాహుల్ గాంధీ బైక్ రైడింగ్ చేస్తే బీజేపీ నేతలకు ఎందుకు అంత ఆనందం?

మామూలుగా ఏదైనా పాజిటివ్ గా జరిగితే సొంత పార్టీవారు గంతులేస్తారు, విపక్ష నేతలు ఒంటి కాలిపై లేస్తారు. మరలాంటప్పుడు రాహుల్ గాంధీ ఏదైనా చేస్తే కాంగ్రెస్ నేతలు ఆనంద పడాలి కానీ భారతీయ జనతా పార్టీ నేతలు ఆనందపడటమేంటని అనుకుంటున్నారా?

Rahul Gandhi Bike Riding in Ladakh: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 సహా 35ఏ లను తొలగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ తొలిసారిగా లధాఖ్‌ చేరుకున్నారు. సుమారు 500 మంది యువతతో కలిసి రోడ్లపై బైక్ రైడింగ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. అనంతరం సోషల్ మీడియాలో ఆ చిత్రాలను పంచుకున్నారు. అయితే ఈ ఫీట్ పై సహజంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేయాలి. అలాగే చేశారు కూడా. కానీ ఈసారి వారితో పాటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..

మామూలుగా ఏదైనా పాజిటివ్ గా జరిగితే సొంత పార్టీవారు గంతులేస్తారు, విపక్ష నేతలు ఒంటి కాలిపై లేస్తారు. మరలాంటప్పుడు రాహుల్ గాంధీ ఏదైనా చేస్తే కాంగ్రెస్ నేతలు ఆనంద పడాలి కానీ భారతీయ జనతా పార్టీ నేతలు ఆనందపడటమేంటని అనుకుంటున్నారా? వారి ఆనందానికి ఓ లాజిక్ ఉంది. మోదీ ప్రభుత్వం నిర్మించిన రోడ్ల మీద రాహుల్ బైక్ రైడింగ్ చేశారట. బీజేపీ నేతలు ఇందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, ప్రహ్లాద్ జోషి సహా పార్టీలోని అనేక మంది సీనియర్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఇలా స్పందించారు.

China: మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడిన చైనా.. ఇప్పుడు 42 యుద్ధ విమానాలతో..

కిరెన్ రిజిజు తన ఎక్స్ (ట్విట్టర్‌) ఖాతాలో 2012 నాటి వీడియోని షేర్ చేస్తూ.. ‘‘లడఖ్‌లోని పాంగోంగ్ త్సో మార్గంలో రాళ్లు, రప్పల్లతో నిండిన తాత్కాలిక రహదారిని నావిగేట్ చేయడమే కాకుండా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ప్రయాణానికి అనుగుణంగా మలిచిన విధానం చూడవచ్చు’’ అని పోస్ట్ చేశారు. ఇక అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీకి ఆయన థాంక్స్ కూడా చెప్పారు. “నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించిన లధాఖ్ క్లాసిక్ రోడ్లను ప్రోత్సహించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు” అని రిజిజు పోస్ట్ చేశారు.

Congress Working Committee: కాంగ్రెస్ టాప్ బాడీలోకి సచిన్ పైలట్, శశిథరూర్.. అసంతృప్తుల్ని ఈ విధంగా బుజ్జగిస్తున్నారా?

కశ్మీర్ లోయలో పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందో గతంలో కూడా రాహుల్ గాంధీ చూపించారని, ఇప్పుడు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో జాతీయ జెండాను శాంతియుతంగా ఎగురవేయవచ్చని అందరికీ గుర్తు చేశారని అన్నారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. “లేహ్, లధాఖ్‌లలో ఆర్టికల్ 370 అనంతర పరిణామాలను చూడటానికి, ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ స్వయంగా లోయకు వెళ్లారు. దాని సంగ్రహావలోకనం చూసి మేము సంతోషిస్తున్నాము” అని పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు