Gujarat: ఆన్‭లైన్‭లో కూతురి అసభ్యకరమైన వీడియో.. ప్రశ్నించినందుకు ఆర్మీ జవాన్‭ను‭ కొట్టి చంపారు

జిల్లాలోని చక్లాసి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు తన కూతురి అసభ్యకరమైన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశాడని తెలుసుకున్న సరిహద్దు రక్షణా దళానికి చెందిన సైనికుడు అతడి ఇంటికి వెళ్లాడు. అతడి వెంట తన భార్య, ఇద్దరు కూతుళ్లు, మేనల్లుడు కూడా వెళ్లారు. జవాను కూతరు, 15 ఏళ్ల బాలుడు ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరూ రిలేషన్‭షిప్‭లో ఉన్నారట

Gujarat: గుజరాత్‭లో దారుణం జరిగింది. చేసిన తప్పును ప్రశ్నించినందుకు ఏకంగా ఆర్మీ జవాన్‭నే కొట్టి చంపారు. తన కూతురి అసభ్యకరమైన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ప్రశ్నించినందుకు సరిహద్దు రక్షణా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన జవాన్‭కు ఎదురైన అత్యంత బాధాకరమైన ఘటన ఇది. రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది. కాగా, ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Vadodara: గుజరాత్ యూనివర్సిటీలో నమాజ్ వివాదం.. కుట్ర దాగుందన్న వీహెచ్‌పీ

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలోని చక్లాసి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు తన కూతురి అసభ్యకరమైన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశాడని తెలుసుకున్న సరిహద్దు రక్షణా దళానికి చెందిన సైనికుడు అతడి ఇంటికి వెళ్లాడు. అతడి వెంట తన భార్య, ఇద్దరు కూతుళ్లు, మేనల్లుడు కూడా వెళ్లారు. జవాను కూతరు, 15 ఏళ్ల బాలుడు ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరూ రిలేషన్‭షిప్‭లో ఉన్నారట. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, బాలిక అసభ్యకరమైన వీడియో చిత్రించిన అతడు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Pragya Singh Thakur: ఇంట్లో కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి, ఎందుకంటే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఈ క్రమంలో జావానుకు బాలుడి కుటుంబానికి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బాలుడి కుటుంబ సభ్యులు జవానుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జవాను.. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు రికార్డుల్లో పేర్కొన్నారు. జవాను మరణం అనంతరం, బాలుడి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి పారిపోయారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, నిందితుల కోసం గాలింపు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు