Kavach Train System : ప్రతి రైలు మార్గంలో ‘కవాచ్’ వ్యవస్థకు డిమాండ్.. పుంజుకుంటున్న ఆ రెండు కంపెనీల షేర్లు

ఒడిశా రైలు ప్రమాదం తరువాత దేశంలోని అన్ని రైలు మార్గాల్లో కవాచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో రెండు కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.

Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతీయ రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో కుట్రకోణం దాగిఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనపై విచారణను సీబీఐకి అప్పగించిన విషయం విధితమే. సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభమైంది. ఇదిలాఉంటే, బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత ఈ మార్గంలో పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసిఉంటే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చుననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Odisha Train Accident : సిగ్నల్ సిస్టమ్‌ను మార్చినట్లు గుర్తించిన రైల్వే శాఖ

ఆర్డీఎస్ఓ (రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) ద్వారా భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవాచ్. 2012లో రైల్వే ఈ వ్యవస్థపై పనిచేయడం ప్రారంభించింది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్) అనేవారు. ఈ వ్యవస్థ అనేక ఎలక్ట్రానిక్ పరికరాల సమితి. ఇందులో రైళ్లు, ట్రాక్‌లు, రైల్వే సిగ్నల్ సిస్టమ్‌లు, ప్రతి స్టేషన్‌లో ఒక కిలో మీటరు దూరంలో రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాలను అమర్చారు. ఈ వ్యవస్థ అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇతర భాగాలతో కమ్యూనికేట్ చేస్తుంది. లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేసిన వెంటనే కవచం యాక్టివేట్ అవుతుంది. వెంటనే సిస్టమ్ లోకో పైలట్ ను హెచ్చరిస్తుంది. రైలు బ్రేక్ లను నియంత్రిస్తుంది. ట్రాక్ పైకి మరో రైలు వస్తున్నట్లు సిస్టమ్ గుర్తించిన వెంటనే మొదటి రైలు కదలికను నిలిపివేస్తుంది.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం

ఒడిశా రైలు ప్రమాదం తరువాత దేశంలోని అన్ని రైలు మార్గాల్లో కవాచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆర్మర్ సిస్టమ్స్ తయారీతో అనుబంధం ఉన్న కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్, హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ షేర్లు సోమవారం భారీగా పెరిగాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి కార్నెక్స్ మైక్రోసిస్టమ్స్ స్టాక్ 5శాతం ఎగువ సర్క్యూట్ ను తాకి రూ. 297.15 వద్ద ముగిసింది. హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ షేర్లు దాదాపు 7.70 శాతం పెరిగి రూ. 120.95 వద్ద ముగిశాయి. అయితే, రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. దేశం మొత్తం రైలు మార్గాల్లో యాంటీ ట్రైన్ కొలిజన్ సిస్టమ్ (కవాచ్) అమలు ప్రక్రియ‌కు చాలా సమయం పట్టొచ్చు.

ట్రెండింగ్ వార్తలు