Bjp Janasena Candidates List : కాకినాడ నుంచి పవన్ కల్యాణ్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి..! బీజేపీ-జనసేన అభ్యర్థులు వీళ్లే..!

జనసేన-బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Bjp Janasena Candidates List : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అధికార, విపక్షాలు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 12 లిస్టుల ద్వారా ఇంఛార్జులను దాదాపుగా 70 నియోజకవర్గాలకు మార్చగా.. ప్రతిపక్ష టీడీపీ – జనసేన కూటమి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ కూటమితో బీజేపీ కూడా చేరిన తర్వాత గత రెండు మూడు రోజులుగా సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేశారు. ఇక, పంపకాలు పూర్తి కావడంతో రేపే రెండో జాబితా ప్రకటిస్తామన్నారు చంద్రబాబాబు.

కూటమి సీట్ల సర్దుబాటు తర్వాత టీడీపీ 144 చోట్ల పోటీకి సిద్ధమవుతోంది. ఇందులో 94 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 50 నియోజకవర్గాలకు అభ్యర్థులను రేపు ప్రకటించబోతున్నారు. ఇదే సమయంలో జనసేన-బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మొదట 24 చోట్ల పోటీ చేస్తామని చెప్పిన జనసేన.. బీజేపీ ఎంట్రీతో 3 సీట్లు త్యాగం చేసింది. ఒక ఎంపీ స్థానాన్ని కూడా వదులుకున్న విషయం తెలిసింది. ఇక, మిగిలిన 21 స్థానాల్లో ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించగా, ఇవాళ మరో ఐదు నియోజకవర్గాలపై క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్. భీమవరం, రాజోలు, నర్సాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చేశారు పవన్. ఇంకా 10 చోట్ల ఎవరు పోటీ చేస్తారు అనేదే సస్పెన్స్.

ఇక, బీజేపీకి కేటాయించిన సీట్లపై ఇంతవరకు ఎలాంటి ప్రకటనా లేదు. ఈ పరిస్థితుల్లో జనసేన-బీజేపీ పోటీ చేయబోయే స్థానాలపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సీట్లు, పోటీ చేసే అభ్యర్థులపై విశ్లేషణ..

Also Read : టీడీపీకి షాక్..! వైసీపీలోకి యనమల కృష్ణుడు..!

బీజేపీ ఎంపీ అభ్యర్థులు..!
* అనకాపల్లి – రేసులో జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్
* రాజమండ్రి – పురంధేశ్వరి
* అరకు – కొత్తపల్లి గీత
* నరసాపురం – రఘురామకృష్ణరాజు
* రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి
* తిరుపతి – రత్నప్రభ(మాజీ ఐఏఎస్), నిహారిక (రత్నప్రభ కుమార్తె)
* హిందూపురం – రేసులో సత్యకుమార్ (ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్), పరిపూర్ణానంద స్వామి (హిందూత్వ ప్రచారకుడు)

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..!
* విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు
* పాడేరు – ఉమామహేశ్వరరావు
* పి.గన్నవరం – అయ్యాజివేమ(మాజీ ఎమ్మెల్యే, వివాదరహితుడు)
* కైకలూరు – కామినేని శ్రీనివాస్
* విజయవాడ వెస్ట్ – గొలగాని రవికృష్ణ(ఎన్ఆర్ఐ), అడ్డూరి శ్రీరామ్ (జిల్లా బీజేపీ అధ్యక్షుడు)
* మైలవరం – బాలకోటేశ్వరరావు (ఎన్టీఆర్ కుటుంబానికి, హరికృష్ణ, పురంధేశ్వరికి అత్యంత సన్నిహితుడు)
* గుంటూరు వెస్ట్ – వల్లూరి జయప్రకాశ్ నారాయణ
* శ్రీకాళహస్తి – కోలా ఆనంద్, భాను ప్రకాశ్ రెడ్డి
* కదిరి – విష్ణువర్దన్ రెడ్డి (బీజేపీ ప్రధాన కార్యదర్శి)
* ధర్మవరం – వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)
* బద్వేల్ – పి.సురేశ్
* రాజంపేట – సాయి లోకేశ్ (సాయి ప్రతాప్ కు స్వయాన అల్లుడు)
* జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
* కర్నూలు – పార్థసారథి (పార్థ డెంటల్ అధినేత, డాక్టర్)

జనసేన ఎంపీ అభ్యర్థులు..!
కాకినాడ – పవన్ కల్యాణ్
మచిలీపట్నం – బాలశౌరి

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు..!
నెల్లిమర్ల – లోకం మాధవి
పాలకొండ – పడాల భూదేవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ (అనూహ్యంగా సీటు దక్కించుకున్న కొణతాల)
విశాఖ దక్షిణ – వంశీకృష్ణ యాదవ్
పెందుర్తి – శివశంకర్, పంచకర్ల రమేశ్
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
నిడదవోలు – కందుల రమేశ్
పిఠాపురం – పవన్ కల్యాణ్
రామచంద్రపురం – చిక్కాల దొరబాబు
రాజోలు – దేవ వరప్రసాద్ (మాజీ ఐఏఎస్)
అమలాపురం – రాజాబాబు
భీమవరం – పులపర్తి రామాంజనేయులు
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ (ముద్రగడ పద్మనాభం వియ్యంకుడు)
నరసాపురం – బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు – ధర్మరాజు
అవనిగడ్డ – వికృతి శ్రీనివాసరావు
తెనాలి – నాదెండ్ల మనోహర్
దర్శి – గరికపాటి వెంటకరావు
తిరుపతి – అరణి శ్రీనివాసులు (చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే, రాయలసీమలో బలిజ సామాజికవర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే)
అనంతపురం అర్బన్ – పెండ్యాల శ్రీలత, మధుసూదన్ రెడ్డి (ధర్మవరంకి చెందిన నేత)
మదనపల్లి – రాందాస్ చౌదరి

 

పూర్తి వివరాలు..

జనసేన పోటీ చేసే 21 సీట్లు ఇవే..!

 

ఏపీలో బీజేపీ పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలివే..!

ట్రెండింగ్ వార్తలు