Pm Modi : కేంద్రంలో మరోసారి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే- రాజమండ్రిలో ప్రధాని మోదీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే..

Pm Modi : మే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే విజయం సాధించబోతోందన్న ప్రధాని మోదీ.. ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

”ఎన్నికల ఫలితాలు ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది. ఏపీ ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా తిరస్కరించింది. వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వారు దాన్ని పూర్తిగా వృథా చేశారు. ఏపీని అభివృద్దిలో వెనక్కి నెట్టేశారు. చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే” అని ప్రధాని మోదీ అన్నారు.

”వికసిత భారత్ లో వికసిత ఏపీ అంతర్భాగం కాబోతోంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పరాభవాన్ని అంగీకరించింది. అభివృద్ధికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే. ఇండియా కూటమి నేతలు ఈడీపై ఎందుకు ఏడుస్తున్నారు? జార్ఖండ్ లో నోట్ల కట్టల కొండను ఈడీ వెలికితీసింది. కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా డబ్బును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లోనూ కొండంత డబ్బు లభించింది. నోట్ల మెషిన్లు లెక్కించలేనంత డబ్బు దొరికింది.

ఎందుకు కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే డబ్బులు దొరుకుతున్నాయి? పట్టుబడ్డ డబ్బుపై కాంగ్రెస్ రాజకుమారుడు సమాధానం చెప్పాలి. దోపిడీ చేసిన డబ్బును పట్టుకుంటే నన్ను తిడుతున్నారు. తిట్లకు భయపడే వాడిని కాను, పేదల కోసం పని చేసే వ్యక్తిని. దోపిడీ చేసిన సొమ్మును ఎలా పంచాలో ఆలోచిస్తున్నాం. గతంలో కూడా రూ.17వేల కోట్లను హక్కుదారులకు అందించాం. యూపీఏ పాలనంతా స్కామ్ ల మయం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అంటే ఏంటి? దీనిపై రచ్చ దేనికి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు