Elon Musk : ఏడేళ్ల తర్వాత మొదటిసారి తండ్రిని కలిసిన ఎలన్ మస్క్.. ఫ్యామిలీ ఫుల్ ఎమోషనల్!

Elon Musk : స్పేస్‌ఎక్స్ అతిపెద్ద రాకెట్‌లలో ఒకటైన స్టార్‌షిప్ లాంచ్ సమయంలో తండ్రి ఎర్రోల్‌ను ఎలన్ మస్క్ కలుసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత మొదటిసారి మస్క్‌ను చూడగానే కుటుంబమంతా భావోద్వేగానికి లోనైంది.

Elon Musk : ప్రపంచ బిలియనీర్, స్పేస్‌ఎక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఏది చేసినా అది సంచలనమే.. ట్విట్టర్ (X) కొనుగోలు చేయడం దగ్గర నుంచి అనేక విషయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. గత వారమే స్టార్‌షిప్‌ రాకెట్‌ను ప్రయోగించగా అది ఫెయిల్ అయింది. అదే సమయంలో మస్క్ తన తండ్రి ఎర్రోల్ మస్క్‌ను కలుసుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని మస్క్ కలుసుకున్నాడు. దాంతో కుటుంబమంతా భావోద్వేగానికి లోనైంది.

తండ్రీకొడుకులను కలిపిన స్టార్‌షిప్ : 
ది సన్ ప్రకారం.. టెక్సాస్‌లోని బోకా చికాలో ఈ ఫ్యామిలీ మీట్ జరిగింది. స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్ అయినప్పటికీ… మస్క్ ఫ్యామిలీని కలిపింది. ఎర్రోల్ మస్క్ తన మాజీ భార్య హీడ్, మనవరాలు కోరాతో కలిసి స్టార్‌షిప్ లాంచ్‌కు హాజరయ్యారు. మస్క్ తన తండ్రిని కలవడం ఏడేళ్లలో ఇదే తొలిసారి అని అవుట్‌లెట్ తెలిపింది. ఇప్పటివరకు స్పేస్‌ఎక్స్ నిర్మించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగాల్లో స్టార్‌షిప్ ఒకటి. కొన్నాళ్లుగా తండ్రీకొడుకుల మధ్య విబేధాలు కొనసాగుతున్నప్పటికీ విభేదాలను పక్కనబెట్టి ఒకరినొకరు కలుసుకున్నారు.

2016లో చివరిసారిగా ఫ్యామిలీని కలిసిన మస్క్ : 

చివరిసారిగా 2016లో మస్క్, అతని సోదరుడు కింబాల్ తమ తండ్రి 70వ పుట్టినరోజును కలిసి జరుపుకున్నారని ది సన్ నివేదికలో పేర్కొంది. చాలా ఏళ్ల తర్వాత తన ఫ్యామిలీకి మస్క్ దగ్గర కావడంతో కుటుంబమంతా సంతోషించింది. రాకెట్ లాంచ్ సందర్భంగా తనకు ఆహ్వానం పంపడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని తండ్రి ఎర్రోల్ అన్నారు. మస్క్‌ను చూడగానే కుటుంబమంతా బోరునా ఏడ్చేసింది. ఇది చాలా ఎమోషనల్ మూవెంట్.. మస్క్‌ను చూసి తండ్రి ఎర్రోల్ చాలా సంతోషించాడు.

Elon Musk

మస్క్‌ కూడా తన తండ్రిని చూసి చాలా సంతోషంగా కనిపించాడని నివేదిక వెల్లడించింది. తండ్రితో కలిసి ఎలన్ టేబుల్ వద్ద ఒకరి పక్కన కూర్చున్నారు. సరదాగా కాసేపు తండ్రీకొడుకులు మాట్లాడుకున్నారని తెలిపింది. స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ మొదటిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. అయితే, అది లిఫ్ట్ ఆఫ్ అయిన 8 నిమిషాల తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పేలిపోయింది. అయినప్పటికీ స్పేస్‌ఎక్స్ అద్భుతమైన విజయంగా పేర్కొంది.

గత ఏప్రిల్‌లో ప్రయత్నానికి భిన్నంగా బూస్టర్ రాకెట్ మెగా షిప్ నుంచి విజయవంతంగా విడిపోయింది. కానీ, ఆ తర్వాత అది పేలిపోయింది. కొద్దిసేపటికే స్పేస్‌షిప్ కూడా దానిని అనుసరించింది. స్టార్‌షిప్‌లోని రెండు దశలను కలిపితే, రాకెట్ 397 అడుగుల (121 మీటర్లు) పొడవు ఉంటుంది. అంటే.. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని 90 అడుగుల ఎత్తులో అధిగమించింది.

Read Also : Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ తొలగింపుపై మస్క్ మామ ఫైర్.. ఓపెన్ఏఐ ఏదో దాస్తోంది.. అదేంటో బయటపెట్టాలి..!

ట్రెండింగ్ వార్తలు