Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ తొలగింపుపై మస్క్ మామ ఫైర్.. ఓపెన్ఏఐ ఏదో దాస్తోంది.. అదేంటో బయటపెట్టాలి..!

Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడం వెనుక కారణాన్ని ఓపెన్‌ఏఐ పబ్లిక్‌గా బయటపెట్టాలని బిలియనీర్ ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రపంచానికి తెలియని ఏదో విషయం దాస్తున్నారంటూ మస్క్ ఫైర్ అయ్యారు.

Elon Musk : అత్యంత పవర్‌ఫుల్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని సృష్టించిన సామ్ ఆల్ట్‌మన్ తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్ఏఐ ఆకస్మాత్తుగా కంపెనీ సీఈఓ ఆల్ట్‌మన్ ఎందుకు తొలగించిందో తెలియక టెక్ ప్రపంచం నిర్థాంతపోయింది. ఆల్ట్‌మాన్‌పై వేటు ఎందుకు వేయాల్సి వచ్చింది? అందుకు అసలు కారణం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై బిలియనీర్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ గట్టిగానే స్పందించారు. మస్క్ సహా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సహా పలువురు టెక్ దిగ్గజాల అధినేతలు ఈ వార్తలపై స్పందించారు. ఆల్ట్‌మన్ చేసిన తప్పేంటి? ఎందుకు సీఈఓ పదవి నుంచి తప్పించారో ప్రపంచానికి తప్పక వెల్లడించాలని మస్క్ మామ డిమాండ్ చేశారు.

ఓపెన్ఏఐ ఏదో దాస్తోంది.. అది బయటపెట్టాలి :
కంపెనీని నడిపించే ఆల్ట్‌మాన్ సామర్థ్యాలపై ఇకపై తమకు నమ్మకం లేదని ఓపెన్ఏఐ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పూర్తిగా తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని మస్క్ అప్రాయపడ్డారు. ఆల్ట్‌మన్ తొలగింపు వెనుక అసలు కారణాన్ని కంపెనీ ప్రజలకు వెల్లడించాలని, అది ఏదైనా ఉండవచ్చనని మస్క్ సందేహం వ్య‌క్తం చేశారు. ఓపెన్ఏఐ ప్రపంచానికి తెలియనది ఏదో దాస్తున్న‌ట్టుగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Read Also : OpenAI Mira Murati : ఎవరీ మీరా మురాటి.. ఓపెన్ఏఐ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు.. 34 ఏళ్ల ఇంజనీర్ ప్రొఫైల్ ఇదిగో..!

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓపెన్ఏఐ సొంత సీఈఓని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ప్రతిఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం కచ్చితంగా ఉందని ఆయన అన్నారు. శామ్ ఆల్ట్‌మన్ విషయంలో ఇంత కఠినమైన చర్య తీసుకోవాలని బోర్డు ఎందుకు భావించిందో ప్రజలకు తెలియజేయాలని మస్క్ ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.

ఓపెన్ఏఐ సీఈఓగా ఆల్ట్‌మన్ తిరిగి వస్తాడా? :

గత శనివారమే సామ్ ఆల్ట్‌మాన్ తొలగింపును కంపెనీ ప్రకటించింది. అతను బోర్డు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొంది. ఓపెన్ఏఐ అగ్రగామిగా కొనసాగగల అతని సామర్థ్యంపై బోర్డుకి ఇకపై విశ్వాసం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఆల్ట్‌మన్ స్థానంలో సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన మీరా మురాటిని తాత్కాలిక సీఈఓగా నియమించడం అన్నిచకచకా జరిగిపోయాయి.

ఈ క్రమంలో తనను తొలగించడంపై ఆల్ట్‌మన్ పాజిటివ్‌గానే స్పందించారు. ఇంతలో సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్‌తో సహా పెట్టుబడిదారులు సామ్‌ను తిరిగి నియమించాలని బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓపెన్ఏఐ సీఈఓగా ఆల్ట్‌మన్ తిరిగి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి మళ్లీ సామ్ ఓపెన్ఏఐకి వచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది.

Elon Musk Sam Altman

2018లోనే ఓపెన్ఏఐ నుంచి మస్క్ ఔట్ :
సామ్ ఆల్ట్‌మన్ మాత్రమే కాదు.. ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుల్లో ఎలోన్ మస్క్ ఒకరని ఇప్పటికే అందరికి తెలుసు. 2018లో ఓపెన్ఏఐ కంపెనీ నుంచి మస్క్ నిష్ర్కమించాడు. అందులోని తన వాటా మొత్తాన్ని కూడా వదులుకున్నాడు. ఓపెన్ఏఐ నుంచి మస్క్ నిష్క్రమణ వెనుక కారణాలు కూడా ఒకటి కన్నా ఎక్కువసార్లు చర్చకు వచ్చాయి. కొన్ని నివేదికలు ఆసక్తికర పరిస్థితుల కారణంగా మస్క్ విడిచిపెట్టినట్లు పేర్కొన్నాయి.

మరికొందరు టెక్ మొగల్ కంపెనీపై పూర్తి కంట్రోల్ కోరుకుంటున్నారని, ఇతర బోర్డు సభ్యులతో పాటు ఆల్ట్‌మాన్ దానిని వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో సామ్ ఆల్ట్‌మాన్ ఓపెన్ఏఐ నుంచి మస్క్ నిష్క్రమణ గురించి ప్రస్తావించారు. మస్క్ కంపెనీని విడిచిపెట్టినప్పుడు కంపెనీకి తగినంత నిధులు సమకూర్చడానికి చాలా కష్టమైందని ఆల్ట్‌మాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Read Also : OpenAI CEO Sam Altman : చాట్‌జీపీటీ క్రియేటర్‌పైనే వేటు.. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను ఓపెన్ఏఐ ఎందుకు తొలగించింది? అసలేం జరుగుతోంది?

ట్రెండింగ్ వార్తలు