OpenAI Mira Murati : ఎవరీ మీరా మురాటి.. ఓపెన్ఏఐ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు.. 34 ఏళ్ల ఇంజనీర్ ప్రొఫైల్ ఇదిగో..!

OpenAI Mira Murati : సూపర్‌కంప్యూటింగ్ స్ట్రాటజీ మేనేజింగ్ రీసెర్చ్ టీమ్‌ల సామర్థ్యంలో మీరా మురాటి 2018లో ఓపెన్ఏఐలో చేరారు. అప్పటినుంచి కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నాయకత్వంలో కంపెనీ కార్యకలాపాల్లో సమర్థవంతంగా పనిచేశారు.

OpenAI Mira Murati : ఎవరీ మీరా మురాటి.. ఓపెన్ఏఐ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు.. 34 ఏళ్ల ఇంజనీర్ ప్రొఫైల్ ఇదిగో..!

Who Is Mira Murati, The 34-Year-Old Engineer Now Leading OpenAI

OpenAI Mira Murati : ఏఐ టెక్నాలజీలో కొద్దికాలంలోనే ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ ప్రభంజనం సృష్టించింది. చాట్‌జీపీటీ రాకతో ఒక్కసారిగా టెక్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దారితీసింది. 2015లో డెవలప్ చేసిన ఈ చాట్‌జీపీటీ రానున్న ఏళ్లల్లో మరింత ఆదరణ పొందింది. అదే దూకుడుతో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ సారథ్యంలో ఈ ఏఐ టూల్ అనేక అద్భుతాలు సాధించింది. కానీ, ఇప్పుడు అదే చాట్‌జీపీటీ సృష్టికర్త ఆల్ట్‌మన్‌కు ఓపెన్ఏఐ కంపెనీ షాకిచ్చింది.

ఎవరూ ఊహించని విధంగా ఆయన్ను కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి తొలగించింది. శామ్ స్థానంలో తాత్కాలిక సీఈఓగా మీరా మురాటీనికి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మీరా ఓపెన్ఏఐలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మే 2022లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఆమె పదోన్నతి పొందారు. ఓపెన్‌ఏఐ తన టూల్స్‌ను పబ్లిక్‌గా పరీక్షించే వ్యూహాంలో 34 ఏళ్ల మీరా కీలకపాత్ర పోషించారు.

Read Also : Amazon Alexa Layoffs : అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల్లో కోతలు.. ఇప్పుడు అలెక్సా వంతు.. వందలాది మంది ఉద్యోగులపై వేటు!

కంపెనీ మాజీ ఉద్యోగుల ప్రకారం.. ఓపెన్‌ఏఐ కార్యకలాపాల అధిపతిగా ఆమె సమర్థవంతంగా పనిచేశారు. ఇంజినీరింగ్ బృందం ద్వారా చాట్‌జీపీటీ వెర్షన్లు సకాలంలో అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్‌తో ఓపెన్ఏఐ సంబంధాలను కొనసాగించడంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. పెట్టుబడిదారు, భాగస్వామి సాంకేతికతను అమలు చేయడంలో విజయం సాధించారు.

వాషింగ్టన్, ఐరోపాలో కంపెనీ కృత్రిమ మేధస్సు విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు చూసిన అత్యంత ఉత్తేజకరమైన ఏఐ టెక్నాలజీని రూపొందించడంలో ఆమె సాయపడ్డారు. మీరా నాయకత్వంలో విద్యాసంబంధ పరిశోధనలను ఆచరణాత్మక ఉత్పత్తులకు మారడంలో ఆమె వంతు కృషి చేశారు. తద్వారా ఏఐని మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంతో అగ్రశ్రేణి విద్యావేత్తల బృందంతో కలిపి ఏఐ పట్ల మరింత ఆసక్తిని రేకెత్తించింది.

మీరా మురాటి ప్రొఫైల్ వివరాలు :

అల్బేనియాలో పుట్టిన మీరా కెనడాలో పెరిగారు. ఆమె డార్ట్‌మౌత్ కాలేజీలో హైబ్రిడ్ రేస్ కారును నిర్మించడం ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్‌లో అనేక నైపుణ్యాలను సాధించారు. నివేదికల ప్రకారం.. ఆమె తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందినవారు. ఆమె ఏరోస్పేస్, ఆటోమోటివ్, వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR)లో పని చేసింది. ఆ తరువాత, ఎంఎస్ మురతి ఎలోన్ మస్క్ టెస్లాలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు. మోడల్ (X) అభివృద్ధిలోనూ ఆమె కీలక పాత్ర పోషించింది. మురాటి కూడా వీఆర్ కంపెనీ, లీప్ మోషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.

Who Is Mira Murati, The 34-Year-Old Engineer Now Leading OpenAI

Mira Murati 

ఆచరణాత్మక, వాస్తవ-ప్రపంచ దృశ్యాలలో కృత్రిమ మేధస్సు యాప్స్ అమలు చేయడంపై ఆమె దృష్టి సారించింది. ఇటాలియన్, అల్బేనియన్, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. ఎంఎస్ మురతి సూపర్‌కంప్యూటింగ్ స్ట్రాటజీ, మేనేజింగ్ రీసెర్చ్ టీమ్‌ల సామర్థ్యంలో 2018లో ఓపెన్ఏఐలో చేరారు. ఆమె నాయకత్వ బృందంలో కూడా భాగమయ్యారు. జట్టు తీసుకున్న నిర్ణయాలను అమలు చేశారు. గత ఏడాదిలో చాట్‌జీపీటీ పంపిణీని చూసే బాధ్యత కూడా మురాటికి ఓపెన్ఏఐ అప్పగించింది.

Read Also : OpenAI CEO Sam Altman : చాట్‌జీపీటీ క్రియేటర్‌పైనే వేటు.. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను ఓపెన్ఏఐ ఎందుకు తొలగించింది? అసలేం జరుగుతోంది?