OpenAI CEO Sam Altman : చాట్‌జీపీటీ క్రియేటర్‌పైనే వేటు.. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను ఓపెన్ఏఐ ఎందుకు తొలగించింది? అసలేం జరుగుతోంది?

OpenAI CEO Sam Altman : చాట‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై వేటు పడింది. కంపెనీ సీఈఓ పదవి నుంచి ఆయన్ను బోర్డు తొలగించింది. ఇంత అత్యవసరంగా ఆల్ట్‌మన్‌ను తొలగించడానికి కారణమేంటి? అసలు ఓపెన్ఏఐలో ఏం జరుగుతోంది?

OpenAI CEO Sam Altman : చాట్‌జీపీటీ క్రియేటర్‌పైనే వేటు.. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను ఓపెన్ఏఐ ఎందుకు తొలగించింది? అసలేం జరుగుతోంది?

Why did OpenAI fire CEO Sam Altman_ Profit and safety seem to be the reasons

OpenAI CEO Sam Altman : ఏఐ టెక్నాలజీ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది చాట్‌జీపీటీ.. లాంచ్ అయిన కొద్దిరోజుల్లోనే ప్రభంజనం సృష్టించింది. అంతటి పవర్‌ఫుల్ చాట్‌జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పైనే వేటుపడింది. సీఈఓ పదవి నుంచి తొలగింపునకు ప్రధాన కారణమేంటి? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఏది అందుబాటులో లేదు. కానీ, కంపెనీ నిర్ణయం ప్రకారం.. ఆయనపై నమ్మకం సన్నగిల్లడమే అసలు కారణమని తెలుస్తోంది.

తాత్కాలిక సీఈఓగా మీరా మురాటీ :

అందుకే ఓపెన్ఏఐ సీఈఓ బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఓపెన్ఏఐ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. శామ్ తొలగింపుతో ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓగా మీరా మురాటీనికి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మీరా ఓపెన్ఏఐలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

Mira Murati: interim CEO Chatgpt

Mira Murati: interim CEO Chatgpt

శామ్ తొలగింపుపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్న అనంతరం విషయం వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ బోర్డు కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన తర్వాత టెక్ ప్రపంచం ఒక్కసారిగా నిర్ధాంత పోయింది. ఎవరూ ఊహించని విధంగా ఇలా జరగడంతో అసలేం జరిగి ఉంటుందా? అనే చర్చ నడుస్తోంది.

Read Also : OpenAI ChatGPT Jobs : చాట్‌జీపీటీ OpenAI నియామకాలు.. ఈ స్కిల్స్ మీకుంటే.. రూ. 3.7 కోట్ల వరకు జీతం.. దెబ్బకి లైఫ్ సెటిల్!

వాస్తవానికి చాట్‌జిపిటి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ట్‌మన్ ప్రొఫైల్‌ను ఏఐ ఇండస్ట్రీలో మేధావుల స్థాయికి ఎదిగారు. ఒక విధంగా ఓపెన్ ఏఐ అభివృద్ధిలో కర్త, కర్మ, క్రియ అన్నివిధాలుగా తానై ముందుకు నడిపారనే చెప్పాలి. సంస్థ ఎదుగుదలకు వెన్నంటి నిలబడ్డాడు. అదే ఆయన్ను ఏఐ ప్రపంచంలో తిరుగులేని వ్యక్తిగా నిలిపింది.

తెర వెనుక కారణాలేంటి? ఆధిపత్య పోరు కారణమా? :
అలాంటి వ్యక్తిని ఓపెన్ఏఐ ఎందుకు తొలగిస్తుంది? అనేది చాలామందికి అంతుపట్టని ప్రశ్నగా కనిపిస్తోంది. బయటకు వినిపించే కారణాలు ఒకటి అయితే.. తెర వెనుక కారణాలు వేరే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అది ఆధిపత్య పోరు కారణమా? లేక సంస్థలో ఆయన పనితీరు నచ్చకపోవడంతోనే ఇలా ఆకస్మాత్తుగా ఉద్వాసన పలకడానికి దారితీసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఓపెన్ ఏఐ పోస్ట్ చేసిన బ్లాగ్‌లో కారణాలు మాత్రం ఇలా ఉన్నాయి..

Why did OpenAI fire CEO Sam Altman_ Profit and safety seem to be the reasons

Why did OpenAI fire CEO Sam Altman

బోర్డు సమావేశాల్లో జరిగిన అంతర్గత చర్చల్లో ఆల్ట్‌మన్‌ నిజాయితీగా ఉండటం లేదని కంపెనీ చెబుతోంది. సరైన సమాచారాన్ని అందరితో షేర్ చేయడం లేదని వెల్లడించింది. బోర్డు నిర్ణయాలకు ఆయన అదేపనిగా అడ్డుపడుతున్నారని ఓపెన్ఏఐ తెలిపింది. తమకు శామ్ నాయకత్వంపై విశ్వాసం లేదని, అందుకే ఆయన్ను సీఈఓ పదవి నుంచి తప్పించడానికి కారణమని చెబుతోంది.

ఓపెన్ఏఐతో కలిసి చాలా ఇష్టంగా పనిచేశాను :
దీనిపై ఆల్ల్‌మన్ మాత్రం పాజిటివ్‌గానే స్పందించారు. కంపెనీలో పనిచేయడంపై తనకు చాలా ఇష్టమని అన్నారు. చాలామంది మేధావులతో కలిసి పనిచేయడం ఎంతో బాగుందని, తర్వాత ఏంటి? అనేదానిపై ఇంకా ఆలోచించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఓపెన్ ఏఐ తొలగించడంపై సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్‌మన్ కూడా అల్ట్‌మన్‌కు మద్దతు ఇచ్చాడు. భద్రత, లాభం వంటి విషయాలపై భిన్నాభిప్రాయాల కారణంగా ఏఐ బోర్డు ఆయన్నను తొలగించి ఉంటుందని అంటున్నారు. చాట్‌జీపీటీ ఆరంభంలో ఎటువంటి లాభాపేక్ష లేనదిగా ఉండి రానురానూ లాభాపేక్షతో కూడిన మోడల్‌గా మారిందనే విమర్శలు కూడా వచ్చాయి.

Why did OpenAI fire CEO Sam Altman_ Profit and safety seem to be the reasons

OpenAI fire CEO Sam Altman

2015లో చాట్‌జీపీటీ.. రెండు నెలల్లోనే 10కోట్ల మంది యూజర్లు : 
ఏఐ టెక్నాలజీతో రన్ అయ్యే చాట్‌జీపీటీ మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక మద్దతుతో ఓపెన్‌ఏఐ 2015లో డెవలప్ చేసింది. స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌తో కలిసి శామ్ ఆల్ట్‌మెన్ ఈ ఏఐని రూపొందించారు. 2018లో ఇదే కంపెనీ నుంచి మస్క్‌ వైదొలిగారు. ఆ తర్వాత చాట్‌జీపీటీ ఊహించని విధంగా సక్సెస్ అయింది. కేవలం రెండునెలల్లోనే చాట్‌జీపీటీ 10 కోట్ల మంది యూజ‌ర్లను చేరుకుంది. ఆ తర్వాత నుంచే ఇతర టెక్ కంపెనీలు సైతం ఏఐ చాట్‌జీపీటీ బాటలోనే సొంత ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయాలనే పోటీ మొదలైంది.

ఆల్టమన్ తొలగింపు.. చాట్‌జీపీటీపై ప్రభావం ఉంటుందా? :
కొద్ది రోజుల క్రితం డెవలపర్స్ డే సందర్భంగా ఓపెన్ ఏఐ సొంత కస్టమ్ ఏఐ సిస్టమ్‌ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కంపెనీ సిస్టమ్స్‌లో ఏదో సమస్య తలెత్తింది. దాంతో చాట్‌జీపీటీ గంటల తరబడి నిలిచిపోయింది. అప్పుడే కొత్త చాట్‌జిపిటి ప్లస్ సైన్-అప్‌లను కొద్దిసేపు పాజ్ చేస్తున్నామని ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆల్ట్‌మాన్ ఓపెన్‌ఏఐ నుంచి ఎందుకు నిష్క్రమించారనేది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఏదిఏమైనా ఆల్ట్‌మన్ తొలగింపుతో గూగుల్, ఎలన్ మస్క్ వంటి కంపెనీలకు కూడా భారీగా ఉపశమనం కలిగించేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. చాలావరకూ టెక్ దిగ్గజాలు సొంత ఏఐ సిస్టమ్‌లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆల్ట్‌మన్ తొలగింపు చాట్‌జీపీటీ మనుగడపై రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Read Also : AI ChatGPT Outage : చాట్‌జీపీటీకి ఏమైంది? ఒక్కసారిగా నిలిచిపోయిన ఏఐ చాట్‌బాట్.. మీకూ ఇలా మెసేజ్ కనిపించిందా?