AI ChatGPT Outage : చాట్‌జీపీటీకి ఏమైంది? ఒక్కసారిగా నిలిచిపోయిన ఏఐ చాట్‌బాట్.. మీకూ ఇలా మెసేజ్ కనిపించిందా?

AI ChatGPT Outage : ప్రపంచాన్ని వణికించిన ఏఐ చాట్‌జీపీటీకి ఏమైంది? ఓపెన్ఏఐ చాట్‌బాట్ సిస్టమ్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. చాలా మంది వినియోగదారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. మీకూ కూడా ఇలాంటి మెసేజ్ కనిపించిందా? ఓసారి చెక్ చేయండి.

AI ChatGPT Outage : చాట్‌జీపీటీకి ఏమైంది? ఒక్కసారిగా నిలిచిపోయిన ఏఐ చాట్‌బాట్.. మీకూ ఇలా మెసేజ్ కనిపించిందా?

ChatGPT not working for you_ You are not alone, OpenAI systems have been hit by a major outage

Updated On : November 9, 2023 / 9:58 PM IST

AI ChatGPT Outage : అసలే ఇది ఏఐ డిజిటల్ యుగం.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీదే ఇప్పుడు ట్రెండ్.. అలాంటి ఓపెన్ఏఐ చాట్‌బాట్ ఒకటి ప్రపంచాన్నే వణికించింది. అదే.. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ. సరిగ్గా ఏడాది క్రితమే ఈ ఏఐ చాట్‌జీపీటీ యాప్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇఛ్చింది. అప్పటి నుంచి వైరల్ ఏఐ చాట్‌బాట్ చాలా మంది రోజువారీ జీవితంలో భాగమైంది. ఈ చాట్‌జీపీటీ సాయంతో ఏదైనా సమాచారాన్ని సెకన్ల వ్యవధిలో పొందడం చాలా ఈజీ అయింది. కవిత్వం రాయాలన్నా కంటెంట్ కావాలన్నా రీసెర్చ్ చేయాలన్నా ఏ సమాచారమైన క్షణాల్లో వెతికి పెట్టేస్తుంది.

విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు కావచ్చు, ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగించడానికి అనేక మార్గాలను కనుగొన్నారు. ఇప్పుడా ఏఐ టూల్‌కు అంతరాయం కలిగింది. చాలా మంది వినియోగదారులకు ఈ చాట్ జీపీటీ పనికిరాకుండా పోయింది. చాట్‌జీపీటీ ఒక్కసారిగా డౌన్‌ అయింది. మీరు ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే.. ‘ఏదో తప్పు జరిగింది. ఈ సమస్య కొనసాగితే దయచేసి (help.openai.com)లో మా హెల్ఫ్ సెంటర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి’ అనే మెసేజ్ కనిపిస్తోంది.

Read Also : Jio Free Swiggy Lite Plan : ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌పై ఫ్రీ స్విగ్గీ లైట్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

అసలు కారణం ఇదేనట :
మీ చాట్‌జీపీటీ పని చేయడం లేదా? కంగారుపడకండి.. మీరు ఒక్కరే కాదు.. ఏఐ టూల్ అనేక దేశాల్లోని వినియోగదారులకు దాదాపు 90 నిమిషాల పాటు నిలిచిపోయింది. ప్రస్తుతం (ChatGPT) సామర్థ్యంలో ఉందని చాట్‌బాట్ మెసేజ్ కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. ఓపెన్‌ఏఐ కూడా సమస్యను గుర్తించి టెక్ బృందంతో సమస్యను పరిశోధిస్తోంది. (DDoS) నుంచి అసాధారణ ట్రాఫిక్ మోడల్ కారణంగా అంతరాయం కలిగిందని, పరిష్కరించేందుకు టీంతో కలిసి పనిచేస్తున్నామని కంపెనీ తెలిపింది.

చాట్‌జీపీటీ కొత్త అప్‌డేట్స్‌.. జీపీటీ-4 టర్బో కూడా :

ఇటీవల, ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ కొత్త అప్‌డేట్‌లను ప్రకటించింది. జీపీటీ-4 టర్బోను కూడా ఆవిష్కరించింది. ఇంకా కంపెనీ అత్యంత శక్తివంతమైన ఎల్ఎల్ఎమ్ కూడా అందిస్తోంది. అదనంగా, ఈ అప్‌గ్రేడ్‌లలో ఒకటి మీరు త్వరలో మీ సొంత చాట్‌జీపీటీ వెర్షన్‌లను క్రియేట్ చేయొచ్చు. ఈ ఏఐ టూల్ ఉపయోగించుకునేలా చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అంతేకాకుండా, చాట్‌జీపీటీకి దాదాపు 100 మిలియన్ వీక్లీ యాక్టివ్ యూజర్‌లు ఉన్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది.

ChatGPT not working for you_ You are not alone, OpenAI systems have been hit by a major outage

ChatGPT not working for you 

మరికొంత మంది యూజర్లకు జీపీటీలు :
ఓపెన్ఏఐ ఈ కస్టమ్ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌లను జీపీటీలుగా పిలుస్తోంది. మీరు నిర్దిష్ట ప్రయోజనాలకు చాట్‌జీపీటీ కస్టమ్ వెర్షన్‌లను రిలీజ్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ జీపీటీలకు ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీ కంపెనీ ఇంటర్నల్ ఉపయోగం కోసం లేదా ప్రతి ఒక్కరి కోసం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేయడం చాటింగ్ చేయడం, వెబ్‌లో సెర్ఛ్ చేయడం, ఫొటోలను రూపొందించడం వంటి వాటిని సులభంగా ఎంచుకోవచ్చు. అలాగే డేటాను విశ్లేషించవచ్చు. చాట్ జీపీటీ ప్లస్, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు జీపీటీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయితే, త్వరలో మరింత మంది యూజర్లకు జీపీటీలను అందించాలని ఓపెన్ఏఐ యోచిస్తోంది. మీరు కేవలం జీపీటీలను డెవలప్ చేయలేరు. కానీ, ఇతరులు ఉపయోగించేందుకు వాటిని పబ్లిక్‌గా షేర్ చేయవచ్చు.

చాట్ జీపీటీలో డబ్బులు సంపాదించవచ్చు :

ఓపెన్ఏఐ జీపీటీ స్టోర్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అది వెరిఫైడ్ యూజర్లతో క్రియేట్ చేయొచ్చునని ప్రకటించింది. మీ జీపీటీ స్టోర్‌లో భాగమైన తర్వాత ఇతర యూజర్లకు ఉపయోగించడానికి అందుబాటులో ఉంటుంది. మీ జీపీటీ ఎంత మంది వ్యక్తులు ఉపయోగిస్తున్నారు అనేది ఆధారంగా మీరు డబ్బు సంపాదించవచ్చు. జీపీటీ-4 టర్బోపై కంపెనీ ప్రకారం.. ఏఐ మోడల్ గత వెర్షన్ల కన్నా మరింత శక్తివంతంగా, చౌకగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఏప్రిల్ 2023 వరకు డేటాను స్టోర్ చేస్తుంది. లార్జ్ కాంటెక్స్ట్ విండోను కూడా కలిగి ఉంది. అంటే.. మీరు ఇప్పుడు చాలా పెద్ద ప్రాంప్ట్‌లను ఎంటర్ చేయవచ్చు.

Read Also : Hybrid Work Policy : విప్రో, ఇన్ఫోనిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ.. ఇంటి దగ్గర నుంచి చేసింది చాలు.. ఇక ఆఫీసుకు రావాల్సిందే..!