iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Apple iPhone 16 Pro Leak : ఆపిల్ ఐఫోన్ 16ప్రో మోడల్ సరికొత్త ఫీచర్లతో రాబోతోంది. లీక్ డేటా ప్రకారం.. కొత్త డిజైన్, క్యాప్చర్ బటన్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

Apple iPhone 16 Pro Leak : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది. ఈ ఏడాది చివరిలో సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుందని భావిస్తున్నారు. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ గురించి మునుపటి లీక్‌లు, నివేదికలు అనేక కీలక స్పెసిఫికేషన్‌లు, కొన్ని డిజైన్ మార్పులను సూచించాయి. సీఏడీ రెండర్‌లను లీక్ చేసిన ప్రకారం.. ఐఫోన్ 16 లైనప్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటివి ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2023లో ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌‌గ్రేడ్ వెర్షన్లతో రానుందని భావిస్తున్నారు.

Read Also : Wet iPhone Rice : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఆరబెట్టేందుకు బియ్యంలో వేయవద్దు? యూజర్లకు ఆపిల్ హెచ్చరిక? ఎందుకంటే?

ఫొటో, వీడియోల కోసం కొత్త క్యాప్చర్ బటన్ :
ఐఫోన్16ప్రో లీక్ సీఏడీ రెండర్‌లు హ్యాండ్‌సెట్ కుడి అంచున పవర్ బటన్ కింద కొత్త బటన్‌ ఉన్నట్టుగా చూపిస్తున్నాయి. చూసేందుకు క్యాప్చర్ బటన్ మాదిరిగా కనిపిస్తోంది. కెపాసిటివ్ టచ్ కలిగి ఉంటుంది. ఫొటో లేదా వీడియో క్యాప్చర్ ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఈ కొత్త క్యాప్చర్ బటన్ వినియోగదారులకు ఫోకస్, జూమ్ లెవల్స్ ఎడ్జెస్ట్ చేయడంలో సాయపడుతుంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రోలోని యాక్షన్ బటన్ గత ఐఫోన్ 15 ప్రోలో కన్నా పెద్దదిగా ఉండవచ్చని నివేదిక పేర్కొంది.

ఐఫోన్ 15 మాదిరిగానే డిజైన్ :
ఈ హ్యాండ్‌సెట్ 149.6ఎమ్ఎమ్ x71.4ఎమ్ఎమ్ x 8.4ఎమ్ఎమ్ సైజులో ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పాత మోడల్ కన్నా పెద్దదిగా ఉండనుంది. సన్నగా ఉండే బెజెల్స్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా, ఐఫోన్ 16 ప్రో బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉండనుంది. లీకైన రెండర్‌లలో మాడ్యూల్ 3 కెమెరా సెన్సార్‌లు, ఒక లిడార్ మాడ్యూల్, మైక్రోఫోన్, ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.

5ఎక్స్ టెట్రాప్రిజం టెలిఫోటో కెమెరా, 48ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఐఫోన్ భారీ 3,355ఎంఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉండనుంది. ఇటీవల, ఐఫోన్ 16 ప్రో డెజర్ట్ టైటానియం, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని వార్తలు వచ్చాయి. మునుపటి షేడ్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లోని గోల్డ్ కలర్ ఆప్షన్‌తో సమానంగా ఉంటుందని అంచనా. అయితే, రెండోది ఐఫోన్ 6లో మాదిరి స్పేస్ గ్రే ఆప్షన్ పోలి ఉంటుంది.

Read Also : Reliance Jio : జియో తెలంగాణలో ఘనంగా 53వ జాతీయ భద్రతా వారోత్సవాలు

ట్రెండింగ్ వార్తలు