Range Rover Evoque facelift : కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్‌ కారు వచ్చేసిందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయిగా.. ధర ఎంతో తెలుసా?

Range Rover Evoque facelift : కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో డైనమిక్ ఎస్ఈ ట్రిమ్‌లో అందిస్తోంది. ఈ కొత్త కారు పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Range Rover Evoque facelift Launch : భారత మార్కెట్లోకి సరికొత్త కారు వచ్చేసింది. జేఎల్ఆర్ ఇండియా రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్‌ కారును రూ. 67.90 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఈ కొత్త కారు మోడల్ డైనమిక్ SE ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఎస్‌యూవీ మోస్తరు ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌తో వస్తుంది. అయితే ఇంటీరియర్ గణనీయ ఫీచర్లతో వస్తుంది.

పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్ కొత్త హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‌ను పొందింది. లేటెస్ట్ ఫ్యామిలీ గ్రిల్ డిజైన్ ఇప్పుడు రేంజ్ రోవర్ బ్రాండ్‌లో ఏకీకృత రూపాన్ని అందిస్తుంది. ఎస్‌యూవీలో కూపే లాంటి సిల్హౌట్, ఫ్లోటింగ్ రూఫ్, ఫ్లష్ డిప్లోయబుల్ డోర్ హ్యాండిల్స్, కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Read Also : Tata Car Prices Hike : కొత్త కారు కొంటే ఇప్పుడే కొనండి.. ఫిబ్రవరి 1 నుంచి ఈవీలు సహా భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు

రేంజ్ రోవర్ ఎవోక్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో ట్రిబెకా బ్లూ, కొరింథియన్ కాంస్య, నార్విక్ బ్లాక్, కొరింథియన్ బ్రాంజ్ ఉన్నాయి. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ లేటెస్ట్ జనరేషన్ పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ టెక్నాలజీతో వస్తుంది. దీనిని లేటెస్ట్ 11.4-అంగుళాల కర్వ్డ్ గ్లాస్ టచ్‌స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. పివి ప్రో వైర్‌లెస్ ఆపిల్ కేర్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా అందిస్తుంది.

వెదర్, సీటింగ్, ఆడియో వాల్యూమ్ కంట్రోల్స్ కొత్త సైడ్‌బార్‌ల ద్వారా కనిపిస్తాయి. ఇరువైపులా మల్టీ-ఫంక్షనల్ స్లైడింగ్ కంట్రోల్స్ కలిగి ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు విండో డిమిస్టర్‌లు, హీటెడ్, కూల్డ్ సీట్లు వంటి సాధారణంగా ఉపయోగించే ఫీచర్‌లకు వేగంగా యాక్సెస్ కోసం డ్రైవర్‌లకు ప్రీ-డ్రైవ్ ప్యానెల్ అందిస్తుంది.

Range Rover Evoque facelift launched

రేంజ్ రోవర్ ఫేస్‌లిఫ్ట్ తరగతిలో 3డీ సరౌండ్ వ్యూ, క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ, క్లియర్‌సైట్ ఇంటీరియర్ రియర్‌వ్యూతో అత్యంత అధునాతనమైన కెమెరా టెక్నాలజీల సూట్‌లను అందజేస్తుందని పేర్కొంది. కొత్త గేర్ షిఫ్టర్‌తో లేటెస్ట్ సెంటర్ కన్సోల్ డిజైన్ ఉంది. అదనంగా, స్టీరింగ్ వీల్‌పై మూన్‌లైట్ క్రోమ్, సెంటర్ కన్సోల్ ట్రిమ్, ఎయిర్ వెంట్‌లతో సహా కొత్త ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

రెండు ఇంజిన్లతో ఎస్‌యూవీ మోడల్ : 
ఇదివరకటిలా పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లస్ టెక్‌తో వస్తుంది. ఇందులో పీఎమ్ 2.5 ఫిల్ట్రేషన్, కార్బన్ డయాక్సైడ్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి. ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. 2.0-లీటర్ పెట్రోల్ (247హెచ్‌పీ 365ఎన్‌ఎమ్), 2.0-లీటర్ ఇంజినియం డీజిల్ (201కిలోవాట్ 430ఎన్ఎమ్) ఉన్నాయి. అంతేకాదు.. రెండు ఇంజన్లు, మైల్డ్-హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్‌తో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.

Read Also : Tata Cars Booking : కొత్త కారు కొంటున్నారా? ఈ టాటా సీఎన్‌జీ ఎఎమ్‌టి కార్లపై బుకింగ్స్ ప్రారంభం.. ఆన్‌‌లైన్‌లో టోకెన్ ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు