Samsung Galaxy F55 5G Launch : వేగన్ లెదర్ ఫినిష్‌తో శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్, ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy F55 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ నెల 27న శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Aadhaar New Update : 10ఏళ్లుగా అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులు జూన్ 14 తర్వాత పనిచేయవా? UIDAI క్లారిటీ ఇదిగో..!

50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. వేగన్ లెదర్ ఎండ్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ F55 ఫోన్ భారత మార్కెట్లో అత్యంత తేలికైన స్లిమ్మెస్ట్ వేగన్ లెదర్ ఫోన్‌గా పేర్కొంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ధర :
శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ భారత మార్కెట్లో ధర రూ. 26,999, అయితే, 8జీబీ+ 256జీబీ, 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 29,999, రూ. 32,999కు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మే 27న రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ముందస్తు విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ F55 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించే స్టోరేజీ కూడా సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F55 ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.1తో వస్తుంది. నాలుగు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, ఐదు ఏళ్ల భద్రతా అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 8ఎంపీ అల్ట్రావైడ్ యూనిట్, 2ఎంపీ సెన్సార్‌తో పాటు 50ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 50ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

డ్యూయల్ నానో సిమ్-సపోర్ట్ ఉన్న ఫోన్ 5జీ, 4జీ, వై-ఫై, జీపీఎస్, Glonass, Beidou, Galileo, QZSS, NFC, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీని అందిస్తుంది. భద్రత విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంటుంది. ఈ 5జీ ఫోన్ బరువు 180 గ్రాములు, పరిమాణం 163.9 x 76.5 x 7.8ఎమ్ఎమ్ ఉంటుంది.

Read Also : Realme Narzo N65 5G : అదిరే ఫీచర్లతో రియల్‌మి నార్జో N65 ఫోన్ వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు