400ల గొర్రెల్ని బలి ఇచ్చి కరోనాకు శాంతి పూజలు

  • Publish Date - June 11, 2020 / 08:51 AM IST

కరోనా..కరోనా కరోనా..ఎక్కడ విన్నా ఇదే మాట.కరోనా పోవాలంటే జంతు బలులు..నరబలులు ఇస్తున్న ఘటన గురించి కూడా వింటున్నాం. ఈ క్రమంలో కరోనా శాంతించి అంతం అయిపోవాలంటే జార్ఖండ్  కోడెర్మా జిల్లా ఉర్వాన్ గ్రామంలో  అమ్మవారి ఆలయంలో కరోనా శాంతి పూజలు నిర్వహించారు గ్రామస్థులు. పూజలు చేసిన అనంతరం 400 గొర్రెలతో పాటు పలు కోళ్లను బలి ఇచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..పూజలు చేసే సమయంలో కరోనా నిబంధలైన భౌతిక దూరం పాటించలేదు. ఒకరిపై ఒకరు పడుతూ.. పూజలు చేశారు. దీంతో ఆలయం నిర్వాహకులపై విమర్శలువెల్లువెత్తాయి. ఇటువంటి పనుల వల్లనే కరోనా మహమ్మారిగా మారుతోందని పలువురు మండిపడుతున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించటం మానివేసి ఇటువంటి పనులేంటంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు కూడా చేపట్టారు. కానీ గ్రామస్థులు మాత్రం శాంతి పూజల వల్ల తమ గ్రామానికి వైరస్ నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతున్నారు. 

కాగా..ఒడిశాలోకూడా కరోనా పోతుందని అమ్మవారి ఆలయంలో పూజరి నరబలి ఇచ్చాడు. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే.ఇటువంటి మూఢ నమ్మకాలతో ప్రజలు కరోనా విస్తరించటానికి వారధిగా మారుతున్నారని నిపుణులు అంటున్నారు. ఇటువంటి ఘటనలపై ప్రజలకు చైతన్యం కలిగించాలని సూచిస్తున్నారు.

Read: ఆరేళ్ల కొడుకు తనకంటే నానమ్మంటేనే ఇష్టంగా ఉంటున్నాడనీ కత్తితో పొడిచి చంపిన తల్లి

ట్రెండింగ్ వార్తలు